కాంగ్రెస్ పార్టీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.వరి ధాన్యం కొనుగోలుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి.
ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారు.రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు.
చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది.మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరు.
మేము నిరసనలు చేస్తే అరెస్ట్ లు చేయిస్తున్నారు.
దేవుడు దయ వల్ల వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారు.ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీలు ఓకరిపై ఓకరు నెపం పెట్టుకుంటుంన్నారు.
ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు.







