నిజామాబాద్ ఎంపి అరవింద్ కు రైతుల సెగ ఎంపి అరవింద్ ఇంటిని చుట్టుముట్టిన రైతులు పెర్కిట్ లోని అరవింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు రైతుల సెగ ఈరోజు తాకింది.గెలిచిన రోజు నుండి రైతు వ్యతిరేకి అయిన అరవింద్ రైతులతో ఏదో ఒక వివాదం లో చిక్కుకుంటున్నాడు.
జిల్లా కేంద్రంలో ఎక్కడ పర్యటించిన రైతులు అడ్డుకుంటున్నారు.మొన్న ఆర్మూర్ రైతులైతే ఏకంగా గ్రామాలనుండి ఉరికించి పరుగులు పెట్టించారు.
గ్రామ పర్యటనలు మానుకొని ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తున్న అరవింద్ కు ఆర్మూర్ పట్టణములో తన నివాసం లో ఇంకో జలక్ ఇచ్చారు.ఏకంగా రైతులు ఈ సారి తమ వడ్లను కేంద్రం కొనడం లేదని తాము పండించిన వడ్లను పెర్కిట్ లోని నివాసం ముందు ధాన్యాన్ని పారబోసి నిరసన తెలుపుతున్నారు.
జిల్లా నలుమూలలనుండి రైతులు అక్కడికి చేరుకోవడం తో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.







