బన్నీని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది.. అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన నటుడు ఉపేంద్ర!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హీరోగా కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ మాత్రమే చేస్తున్నాడు.

 There Is A Lot To Learn From Watching Bunny Actor Upendra Praised Allu Arjun , A-TeluguStop.com

ఉపేంద్ర మొదట దర్శకుడిగా తన జీవితం మొదలు పెట్టినప్పటికీ హీరోగా పలు సినిమాలలో నటించి తన ప్రతిభ నిరూపించుకున్నారు.తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఉపేంద్ర ఇటీవల గని సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.

ఈ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.బన్నీతో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన సమయంలో జరిగిన సంఘటన గురించి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ “సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా షూటింగ్ సమయంలో బన్నీ నన్ను ఒక గెస్ట్ గా ట్రీట్ చేశాడు.బన్నీ సెట్ లో అందరితో ఎప్పుడు సరదాగా ఉంటూ ప్రత్యేకంగా తనకిష్టమైన వంటకాల గురించి తెలుసుకుని మరీ తెప్పించేవాడు.

Telugu Allu Arjun, Gani, Important, Telugu, Tollywood, Upendra-Movie

ఈ క్రమంలో ఒకసారి నీకు ఏదంటే ఇష్టం అని నేను బన్నీని అడగగా సినిమా షూటింగ్ ఉంటే ఆ రోజు నాకు పండగలా ఉంటుంది.నాకు సినిమాలు తప్ప మరి ఏవి పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పాడు.” అని ఉపేంద్ర చెప్పుకొచ్చాడు.కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు బన్నీ నీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని, సినిమాల పట్ల బన్నీకి ఎంతో, ఇష్టం ఆసక్తి ఉండటం వల్ల ఇంతటి గొప్ప స్టార్ గా ఎదిగాడని బన్నీ గురించి చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube