సూర్యాపేట జిల్లా:మహనీయుల చరిత్ర,సేవలపై త్వరలో బుక్లెట్స్ విడుదల చేస్తామని,విద్యతోనే వెలుగు,గౌరవం దక్కుతుందని,మహనీయుల జయంతులు,వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 196 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని యం.జి.రోడ్డులో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి అదనవు కలెక్టర్ యస్.మోహన్ రావు, బి.సి.సంఘ నాయకులతో కలిసి పులా మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు.
దేశంలో అసమానతలు లేని సమాజం కోసం అలాగే సమానత్వం,హక్కుల కోసం అహర్నిశలు ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని,ఆయన సేవలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.సత్యశోదా అనే సంస్థ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలు వారికి విద్యాబుద్ధులు అందించి చైతన్య వంతులు చేయడం, అలాగే పేదల జీవితాల్లో మార్పు కోసం ముఖ్యoగా మహిళల విద్య కోసం,మహిళా అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
మహనీయుల జీవిత చరిత్ర,వారి సేవల పై బుక్ లెట్స్ త్వరలో జిల్లాలో అన్ని పాఠశాలలు,కళాశాలల్లో విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు.కేసారంలో 21 కుటుంబాలకు ఆత్మ గౌరవ భవనాల కొరకు స్థలం కేటాయించామని,తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని,అలాగే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు.
కరోనా కాలంలో మహనీయుల కార్యక్రమాలు సరిగా నిర్వహించుకోలేదని,ఇకపై మహనీయుల జయంతులు,వర్ధంతులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.జిల్లాలో ఉన్నటువంటి 25 బి.సి సంక్షేమ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు.మోతెలో ఉన్నటువంటి బి.సి.వసతి గృహాన్నీ సూర్యాపేటకు మార్చేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.అనంతరం బిసి,ఎస్సి,ఎస్టి సంఘాల నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు.ఈ వేడుకల్లో డి.ఆర్.ఓ రాజేంద్ర కుమార్,సి.ఈ.ఓ సురేష్,బి.సి.సంక్షేమ అధికారిని అనసూర్య, రాష్ట్ర అధ్యక్షులు వసంత సత్యనారాయణ పిల్లే, జిల్లా అధ్యక్షులు చాలమల్ల నర్సింహ,మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు శారదా దేవి,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హుస్సేన్,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్న శ్రీరాములు,టీఎన్ జీవోస్ అధ్యక్ష,కార్యదర్శులు జానిమియా,దున్న శ్యామ్ కౌన్సిలర్లు కె.శ్రీనివాస్,గoడూరి పావని,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.







