కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఢిల్లీ లో అత్యవసర మీటింగ్ అనంతరం ఈరోజు పాదయాత్ర తిరిగి ప్రారంభించాను ఒక బలుబు,ఒక ప్యాన్ ఉన్న ఇంట్లో కరెంటు బిల్లులు డెవలప్మెంట్ పేరిట అధికంగా వేస్తున్నారు 137 రూపాయిలు రావాల్సిన బిల్లు 3780 రూపాయిలు వచ్చింది అని మల్లమ్మ కరెంటు బిల్లు చూపించి ఎట్లా కట్టాలి అని ఆవేదన వ్యక్తం చేసింది.ఇష్టం వచ్చినట్టు కరెంటు చార్జీలు పెంచితే ప్రజలు ఎట్లా కడతారు?వరి ధాన్యం కొనాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి రైతులను మభ్య పెట్టడం కోసం ధర్నాలు చేయడం దురదృష్టకరం.వరి ధాన్యం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొంటాయా? లేక పరాయి దేశస్థులు అమెరికా పాకిస్థాన్ కొనాలా? వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తుంటే ….కేంద్రంలో ఉన్న బిజెపి తెలంగాణ గల్లీలలో ధర్నాలు చేస్తున్నారు.75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ప్రజా సమస్యలను విస్మరించి ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు టిఆర్ఎస్ బిజెపి మాత్రమే. వీరు పాలకులు గా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం.
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి కొనుగోలు చేయించడం కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నబోనకల్ ఎస్టీ కాలనీకి చెందిన మోతిలాల్ రమ తన పాదయాత్రకు ఏదురొచ్చి 8 ఏళ్లుగా ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నాం.పిల్ల పెద్దలం కలిసి మొత్తం 15 మంది ఒకే ఇంట్లో ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని వందల సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇల్లు ఇవ్వడం లేదని గోడును వెళ్లబోసుకుందని,.
మూడు సంవత్సరాలుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇవ్వడంలేదని దొంతి సరస్వతి, నాలుగు సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వడం లేదని వల్లపురం హేమ, కోటేశ్వరరావులు తమ సమస్యలను చెప్పుకున్నారు అని వెల్లడించారు.బోనకల్లు బి.సి కాలనీకి చెందిన మర్రి చిన్న వెంకులు నెలకు కరెంట్ బిల్లు 350 రావాల్సి ఉండగా ఈ నెల డెవలప్మెంట్ చార్జీల పేరిట 12వేల రూపాయలు బిల్లు వేశారని, ఈ కరెంట్ బిల్లు ఎలా కట్టాలని కన్నీటి పర్యంతమైనాడు.బీటెక్ చదివిన నిరుద్యోగి అనూష ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది.
ఇలాంటి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నాను.ఎనిమిదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం పీపుల్స్ మార్చ్ రణయాత్ర
.






