IPL 22లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.చరిత్రను తిరగరాసాడంటే నమ్మశక్యం కాదు.కానీ ఇది అక్షరాలా నిజం.ఇది ఇంకే క్రీడాకారుడికీ సాధ్యం కానిది మరి.మొత్తం IPL చరిత్రలోనే ఇలా చేసిన మొదటి ఆటగాడిగా అశ్విన్ తన పేరుని లిఖించుకున్నాడు.LSG పై 23 బంతుల్లో 28 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్ 18.3 ఓవర్‌లో సడన్‌గా మ్యాచ్ నుంచి వెళ్లిపోవడం వలన మైదానంలో ఉన్న ప్రేక్షకుల మొత్తం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.అ తరువాత వచ్చిన రియాన్ పరాగ్ చివరి పది బంతులు అడి టీమ్‌కు మంచి స్కోర్ అందించి అందరికీ షాక్ ఇచ్చాడు.
అయితే ఏ బ్యాట్స్ మెన్ అయినా అంపైర్ అనుమతి తీసుకోకుండా రిటైర్ చేసి, మరల తిరిగి ఆటను మొదలపెట్టని యెడల వారిని అంపైర్లు రిటైర్డ్ అవుట్‌గా పరిగణిస్తారు.మంచి స్కోర్‌తో ఉన్న అశ్విన్ ఇలా వెల్లిపోయి IPL చరిత్రలో నిలిచిపోయాడు.
అలాగే తన టీం విజయానికి కూడా దోహదపడ్డాడు అని ఇక్కడ గమనించాలి.ఇంతకముందు IPLలో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్‌గానూ అశ్వినే ఉండడం గమనార్హం.
ఇక్కడ విచిత్రమేంటంటే.మన్కడింగ్ చేసిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ తన ప్రత్యర్థి జట్టు.
తాజాగా రిటైర్డ్ ఔట్ అయిన సందర్భంలో అదే అశ్విన్.రాజస్తాన్ రాయల్స్ జట్టు సభ్యుడిగా ఉండటం గమనార్హం.

అందువలన అశ్విన్‌కు రాజస్తాన్ రాయల్స్‌తో మంచి విడదీయని బంధంగా మారుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. IPL 2019 సీజన్ విషయం ఇక్కడ ఓసారి గుర్తుచేసుకుంటే, రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.అప్పుడు రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులతో జోరు చూపిస్తున్న బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేశాడు.అయితే అశ్విన్ మన్కడింగ్ తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైనా అది సరియైన నిర్ణయమే అని తరువాత తెలుసుకున్నారు.







