ఆ ఒక్క కారణంతో 10 సంవత్సరాలు మీడియాకు దూరంగా ఉన్నా... విజయ్ షాకింగ్ కామెంట్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్.ఈ సినిమా ఈనెల 13వ తేదీ విడుదల కానుంది.

 Vijay Has Been Away From The Media For 10 Years For That Only Onereason Shocking-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన కారణంగా తాను 10 సంవత్సరాల పాటు మీడియాకు దూరంగా ఉన్నానని,ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.ఇక మీడియాకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందనే విషయం గురించి విజయ్ మాట్లాడుతూ…ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను మాట్లాడిన మాటల కారణంగా తాను మీడియాకు దూరమయ్యానని తెలిపారు.

మీడియా సమావేశంలో తను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుని మరోలా వార్తలు రాశారని విజయ్ వెల్లడించారు.

Telugu Beast, Kollywood, Pooja Hegdhe, Tollywood, Vijay-Movie

నేను మీడియా ఎదుట మాట్లాడిన వార్తలను తప్పుగా పేపర్ లో రాయడం వల్ల పెద్ద ఎత్తున వివాదం జరిగిందని, మరుసటి రోజు ఆ వార్తలు చూసి షాక్ అయ్యానని విజయ్ తెలిపారు.అయితే ఆరోజు నేను మాట్లాడిన మాటలు తప్పుగా రాశారని కేవలం ఇంట్లో వారికి మాత్రమే చెప్పగలను కానీ అందరికీ చెప్పలేకపోయాను.అందుకే సుమారు పది సంవత్సరాల పాటు మీడియాకు దూరంగా ఉన్నానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube