తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇక కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ పెట్టిన పరిస్థితిలో ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే.
దీంతో పీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదనే నిరాశలో ఉన్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డికి కాస్త ఊరటనిచ్చే వార్తను తెలిపింది.స్టార్ క్యాంపెయినర్ గా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
దీంతో కోమటి రెడ్డి అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్ లో కోమటి రెడ్డి కీలక నాయకుడిగా ఉన్నా తనకు సముచిత స్థానం దక్కలేదనే నిరాశలో ఉన్న వారికి ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
అయితే రేవంత్ పట్ల గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వెంట నడుస్తారా లేదా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.అయితే తన నియామకం పట్ల ఇంకా కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించకపోయినా త్వరలో స్పందించే అవకాశం ఉంది.
ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఒకసారిగా కాంగ్రెస్ పార్టీని మరింతగా బాలపరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.ఈనెల 24, 25, 26 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ని ముందుకు తీసుకెళ్లడంలో స్టార్ క్యాంపెయినర్ గా ఎలాంటి కీలక పాత్ర పోషిస్తారనేది చూడాల్సి ఉంది.







