రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి.ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ కాగా ఈ సినిమాకు వస్తున్న లాభాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చరణ్, తారక్ అదిరిపోయే నటనతో ఆర్ఆర్ఆర్ మూవీలో అద్భుతంగా నటించి అదరగొట్టారు.రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో సినిమాలోని కొన్ని సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన తర్వాత కూడా రాజమౌళి బాలీవుడ్, హాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఆర్ఆర్ఆర్ మూవీలో ఎవరు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారనే ప్రశ్నకు జక్కన్న ఇప్పటివరకు రామరాజు పాత్రకు చరణ్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని భీమ్ పాత్రకు తారక్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
అయితే ఒక సన్నివేశంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన అంచనాలను మించి అద్భుతంగా నటించాడని జక్కన్న అన్నారు.

హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాలను చెప్పుకొచ్చారు.కొమురం భీముడో సాంగ్ లో తన నటనతో తారక్ నన్ను ఆశ్చర్యపరిచాడని రాజమౌళి తెలిపారు.తన లైఫ్ లో బెస్ట్ ఎపిసోడ్ కొమురం భీముడో సాంగ్ అని మరో సందర్భంలో రాజమౌళి వెల్లడించారు.
మరోవైపు సినిమా విడుదలై రెండు వారాలు దాటినా ఆర్ఆర్ఆర్ సినిమా హవా మాత్రం కొనసాగుతోంది.

దేశవిదేశాల నుంచి జక్కన్న దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఏ హీరోకు ఎంతమేరకు ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్, చరణ్ లకు ఈ సినిమా పాన్ ఇండియా హీరోలుగా ఏ మేరకు గుర్తింపును తెచ్చిపెడుతుందో చూడాల్సి ఉంది.
చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తుండగా ఎన్టీఅర్ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు.