బావను అలా చూసిన తర్వాత గుండె పగిలింది.. అరియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్4 ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అరియానా గ్లోరీ ఒకరు.బిగ్ బాస్ షో సీజన్ 4లో టాప్ 4 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన అరియానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 5 లో బిగ్ బాస్ బజ్ కు అరియానా యాంకర్ గా వ్యవహరించారు.

 Bigg Boss Non Stop Ariyana Glory Breakup Lovestory Details, Ariyana, Ariyana Gl-TeluguStop.com

ఆర్జీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అరియానా ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారమవుతున్న షోలోని కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నారు.

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో అరియానా గ్లోరీ తొలిప్రేమకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.

బాల్యంలోనే తండ్రి ప్రేమకు దూరమైన తాను బావ చేతిలో మోసపోయానని ఆమె చెప్పుకొచ్చారు.బావకు, తనకు మధ్య తొమ్మిదో తరగతిలో ప్రేమ మొదలైందని ఆమె అన్నారు.పదో తరగతిలో ఆ ప్రేమ మరింత బలపడిందని బావ తనపై చూపించే కేరింగ్ ఎంతో నచ్చిందని ఆమె అన్నారు.

నేను తాండూరులో అతను విజయవాడలో ఉండేవాళ్లమని హైదరాబాద్ లో కలిసి ఉన్నామని ఆమె తెలిపారు.

Telugu Ariyana, Ariyanabreakup, Ariyana Glory, Biggboss, Gift-Movie

అయితే బావకు తాను బోర్ కొట్టానని ఒకరోజు చూడకూడని స్థితిలో బావను చూసి తన గుండె పగిలిపోయిందని ఆమె అన్నారు.విడిపోవాలని అనుకోగా బావ సముదాయించడంతో మరో రెండేళ్లు అతనితో ఉన్నానని అరియానా తెలిపారు.ఆ తర్వాత నాకో అబ్బాయి పరిచయం కాగా బావ అనుమానిస్తుంటే బ్రేకప్ చెప్పుకున్నామని అరియానా చెప్పుకొచ్చారు.

Telugu Ariyana, Ariyanabreakup, Ariyana Glory, Biggboss, Gift-Movie

జాబ్ చేసే సమయంలో బావ గుర్తొచ్చి తప్పైపోయిందని కలిసిపోదామని అన్నానని బావకు బర్త్ డే రోజున గిఫ్ట్ ఇచ్చినా తీసుకోలేదని అరియానా అన్నారు.8 సంవత్సరాల రిలేషన్ షిప్ సెట్ కాలేదని ఇప్పుడు బావ వచ్చినా తనకు వద్దని అరియానా కామెంట్లు చేశారు.అరియానా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube