తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది శ్రీలక్ష్మి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.అంతేకాదు లేడీ కమెడియన్గా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించింది.ఇక ఇటీవల కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా అటు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో మాత్రం సందడి చేస్తూ అభిమానులను పలకరిస్తోంది శ్రీలక్ష్మి.
అది సరే గానీ ఇప్పుడూ సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.సీనియర్ నటి శ్రీలక్ష్మి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కి బంధువు అవుతారట.
హా ఇదెక్కడి బంధుత్వం.ఇది ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు కదా.నిజంగానే ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు శ్రీలక్ష్మి ఎక్కడ ఈ విషయాన్ని బయట పెట్టలేదు.కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి.
ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ శ్రీ లక్ష్మీ మధ్య బంధుత్వం ఎక్కడిది అని అనుకుంటున్నారా.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.జూనియర్ ఎన్టీఆర్ తల్లి పేరు శాలిని. ఈమె హరికృష్ణకు రెండో భార్య.అయితే షాలిని శ్రీలక్ష్మి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులట.ఒకే స్కూల్లో ఒకే తరగతి లో క్లాస్ రూమ్ లో చదువుకున్నారట.
ఇక ఇద్దరూ కలిసి ఎన్నో ఆటలు కూడా ఆడుకున్నారట.శ్రీలక్ష్మి సహా శ్రీలక్ష్మి అక్క, శాలిని కూడా మంచి స్నేహితులట.
ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదని అలా చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అంటూ శ్రీలక్ష్మి చెప్పేసింది.