క్లారిటీ ప్లీజ్ : సారొస్తారా ... పోరాటాన్ని నడిపిస్తారా ?  

తెలంగాణ సీఎం కేసీఆర్ అంతరంగం ఏమిటనేది ఆ పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు.కేంద్ర అధికార పార్టీ బిజెపి పై పూర్తిస్థాయిలో పోరాడేందుకు సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు.

  excitement In The Party Over Kcrs Attendance At The Trs Dharna  kcr, Telangan-TeluguStop.com

జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా తెలంగాణలోనూ దెబ్బ కొట్టవచ్చు అని, టిఆర్ఎస్ ప్రభావాన్ని మరింత పెంచుకోవచ్చు అని,  మూడో ప్రత్యామ్నాయ కూటమిని  కేంద్రంలో కీలకం చేయవచ్చు అనే ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమం నడిపించేందుకు సిద్ధమవుతున్నారు.

ధర్నా సక్సెస్ చేసే బాధ్యతలను ఎంపీలకు కేసీఆర్ అప్పగించారు.తెలంగాణ నుంచి పార్టీ కీలక నాయకులు అందరూ ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.

నేడు రేపు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు .ఈమేరకు విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ముందుగానే ఢిల్లీకి వెళ్తున్నారు.
        ఇంకా 11వ తేదీకి రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో టిఆర్ఎస్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 20 మందికి పైగా కీలక నాయకులు వెళ్లే విధంగా ఎమ్మెల్యేలు టిక్కెట్లను బుక్ చేశారు.వీలైనంత ఎక్కువ మందిని తీసుకెళ్లే విధంగా రైలు టికెట్లను ఎమ్మెల్యే లు బుక్ చేశారు.

టిఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో 1500 నుంచి 3 వేల మంది వరకు పార్టీ కీలక ప్రతినిధులంతా పాల్గొనబోతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.జాతీయ స్థాయిలు జరగబోయే ఆందోళన కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ పాల్గొంటాయని టిఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
     

Telugu Peddy, Telangana, Telangana Cm, Trs Ministers-Telugu Political News

  అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఉద్యమానికి సారధ్యం వహిస్తారా లేక కేటీఆర్ తోనే ఈ కార్యక్రమాన్ని ముగించేస్తారు అనేది క్లారిటీ లేదు.ఈ విషయంలో పార్టీ శ్రేణులు అందరిని కేసీఆర్ టెన్షన్ పెడుతూనే ఉన్నారు.కేసీఆర్ పాల్గొంటేనే ఈ ఉద్యమానికి ఊపు వస్తుంది అని, బీజేపీ ఇరుకున పడుతుంది అనేది ఆ పార్టీ వర్గాల భావన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube