ఎం రమేష్, గోపి దర్శకత్వంలో రూపొందిన సినిమా రెడ్డిగారింట్లో రౌడీయిజం.ఇక ఈ సినిమాలో రమణ్ హీరోగా నటించాడు.
ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్ లుగా నటించారు.ఇక ఈ సినిమాను సిరి మూవీస్ బ్యానర్ పై.కే శిరీష రమణారెడ్డి నిర్మించారు.ఇందులో సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్ గా నటించాడు.ఇక ఈ సినిమా విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
ఇందులో వినోద్ కుమార్ ప్రతాప్ రెడ్డి అనే పాత్రలో నటించాడు.ఈయన గ్రామంలో కులాంతర వివాహాలను, ప్రేమ వివాహాలను అసలు ఒప్పుకోడు.ఒకవేళ అలా పెళ్లి జరిగినట్లయితే చంపి పాతి పెట్టే రకం.ఇక తన పక్క గ్రామానికి చెందిన శివ (రమణ్) అనే యువకుడు.ఊర్లో అల్లరిచిల్లరిగా స్నేహితులతో సరదాగా తిరుగుతూ ఉంటాడు.
ఇక తన తండ్రి ఎంత చెప్పినా కూడా డిగ్రీ కంప్లీట్ చేయకుండా ప్రేమ పేరుతో అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.ఇక అలా తన క్లాస్మేట్ అయిన సంధ్య (ప్రియాంక రౌరీ) ను ప్రేమిస్తాడు.
ఇక ఈమె ఎవరో కాదు ప్రతాప్ రెడ్డి కూతురు. ఇక ఆయన తన కూతురి ప్రేమను అంగీకరిస్తాడా.
అసలు సంధ్య శివ ని నిజంగానే ప్రేమించిందా ఆ తర్వాత శివ ఎదుర్కునే కొన్ని మలుపులు ఏంటిది అనేది మిగిలిన కథ లోనిది.

నటినటుల నటన:
తొలిసారిగా వెండితెరకు పరిచయమైన హీరో రమణ్. తన తొలి నటనతోనే బాగా ఆకట్టుకున్నాడు.కేవలం నటనతోనే కాకుండా ఫైట్స్, డాన్సులు కూడా బాగా అదరగొట్టాడు.
ఇక హీరోయిన్స్ గా నటించిన ప్రియాంక, పావని, అంకిత, వర్ష బాగా ఆకట్టుకున్నారు.ఇక వినోద్ కుమార్ తన పాత్ర లో లీనమయ్యాడు.రచ్చ రవి, జూనియర్ బాలకృష్ణ తో పాటు పలువురు కమెడియన్స్ కూడా తమ పాత్రలతో బాగా ఎంటర్టైన్ చేశారు.
టెక్నికల్:
ఇక ఈ సినిమాతో ఇద్దరు దర్శకులు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.మంచి కథను ఎంచుకొని అందులో ట్విస్టులతో బాగా ఆసక్తిగా చూపించారు.శ్రీ వసంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంది.సంగీతం కూడా బాగుంది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

విశ్లేషణ:
ఇక ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది.పైగా దర్శకులు కూడా మంచి కథను అందించారు.కులం, మతం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప మానవత్వాన్ని చక్కగా చూపించారు.కులమనే బేధాలను చూసేవారికి ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ను అందించింది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, సినిమా కథ, సినిమాటోగ్రఫీ, సంగీతం.
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్ లో కాస్త మార్పులు ఉంటే బాగుండేది.
బాటమ్ లైన్:
ఇక ఈ మధ్య కాలంలో ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.పైగా ప్రేమ నేపథ్యంలో రావడంతో ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది.కాబట్టి ఈ సినిమాను చూడటానికి ఎటువంటి అభ్యంతరం లేదు.







