యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన టాలెంట్ తో అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించాలని ఆశపడుతున్న డైరెక్టర్లలో కోలీవుడ్, హిందీ, కన్నడ డైరెక్టర్లు ఉన్నారు.అయితే అయిదేళ్ల క్రితం ఒక డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ ఎవరో తెలియదని కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో సింగం సిరీస్ తో పాపులారిటీని సంపాదించుకున్న హరి సూర్యతో సింగం3 పేరుతో ఒక సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.అయితే సింగం3 ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు వచ్చాయి.ఒక జర్నలిస్ట్ ఎన్టీఆర్ హరి కాంబో మూవీ గురించి హరిని అడగగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదనే అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు.
సింగం3 ఫ్లాప్ తర్వాత హరి సామి సినిమాకు సీక్వెల్ చేయగా ఆ సినిమా కూడా ఫ్లాపైంది.

ప్రస్తుతం ఈ దర్శకుడు అరుణ్ విజయ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు.అయితే గోపీచంద్ హీరోగా హరి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.గత కొంతకాలంగా తెలుగులో గోపీచంద్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు నిరాశపరుస్తున్నాయి.

లౌక్యం తర్వాత ఆ స్థాయి హిట్ లేని గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్, లక్ష్యం2 సినిమాలలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని గోపీచంద్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.తమిళంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లేని హరి గోపీచంద్ తో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.







