సినీ స్టార్స్ వారి జీవితంలో ఏ చిన్న పని చేసిన కూడా సెన్సేషన్ అవుతుంది.అలాంటిది టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఏకంగా పెళ్లినే త్యాగం చేసింది ఒక హీరోయిన్.
ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.స్టార్ హీరోల పెళ్లి విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే మొదటగా టాలీవుడ్ లో గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.46 ఏళ్ల వయసున్న ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి టాపిక్ ప్రతిసారి చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రభాస్ పెళ్లి మీద ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ప్రభాస్ కి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఎంతోమంది ప్రభాస్ తో పెళ్లికి రెడీ అంటున్నారు.
కానీ ఆర్జీవి దర్శకత్వం వహించిన “నగ్నం” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ రాపాక ప్రభాస్ పెళ్లి చేసుకునే వరకు తాను కూడా పెళ్లి చేసుకుని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా చూసినప్పటి నుంచి తాను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఈ భామ ఇటీవల తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేసి రెండవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.

ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ రాపాక తన పెళ్లి ప్రభాస్ పెళ్లితో ముడి పెట్టడంతో ఈ మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే చేసుకుంటారా అని అడగగా.అంతకంటే అదృష్టమా.”ప్రభాస్ ని పెళ్లి చేసుకొని ఒక్కరోజు జీవించినా చాలు” అని సమాధానం చెప్పింది.







