అలియా గంగుబాయ్ హిట్ కావడానికి కారణం ఆ టాలీవుడ్ హీరోనేనా?

బాలీవుడ్ అందాల నటి ఆలియా భట్ తన అందం, అభినయంతో బాలీవుడ్లో మాత్రమే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంది.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Allu Arjun Swag In Pushpa Inspired Me For Doing Gangubai Kathiawadi Movie Says A-TeluguStop.com

ఈ సినిమా సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఆలియాభట్ బాలీవుడ్ లో గంగూబాయ్ కతియావాడి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా భట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మొదట గంగూబాయ్ కతియావాడి గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు స్టోరీ నచ్చినా కూడా ఆ క్యారెక్టర్ ను అభిమానులకు ఎలా కనెక్ట్ చేయాలి అన్న సందేహం ఉండేదట.

కానీ అదే సమయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమాలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ వినూత్నంగా ఉంటుంది.అయితే పుష్ప సినిమా చూసిన తర్వాత ఆలియా భట్ కూడా తన క్యారెక్టర్ ఇలా డిఫరెంట్ గా ఉండాలని భావించి మాస్ క్యారెక్టర్ ట్రై చేసిందట.ఈ సినిమాలో ఆలియాభట్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇలా ఆలియా భట్ తన సక్సెస్ సీక్రెట్ మీడియాతో పంచుకుంది.

Telugu Alia Bhatt, Allu Arjun Swag, Bollywood, Ganguly, Pushpa-Movie

గంగూబాయ్ కతియావాడి సినిమా సక్సెస్ అవటానికి అల్లు అర్జున్ పుష్ప సినిమా కారణం అని అలియా భట్ చెప్పింది.ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ ,గంగూబాయ్ కతియావాడి సినిమాలు సక్సెస్ అవడంతో ఆలియాభట్ మంచి ఫామ్ లో ఉన్నారు.ఇదిలా ఉండగా ఇటీవల ఆలియా భట్ అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్స్ వల్ల తర్వాత అల్లు అర్జున్ నటించబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube