లహరి మ్యూజిక్ ఆల్బమ్‌ ‘డివైన్ టైడ్స్’కి గ్రామీ పురస్కారం

సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ పురస్కార ప్రధానోత్సవం లాస్ వేగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యూ బాల్ రూమ్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది.64వ వార్షిక గ్రామీ అవార్డ్స్ లో ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ విజయకేతనం ఎగురవేశారు.ప్రముఖ అమెరికన్ కంపోజర్ రాక్ లెజెండ్ స్టీవర్ట్ కోప్ ల్యాండ్‌తో కలిసి రిక్కీ కేజ్ చేసిన ‘డివైన్ టైడ్స్’ అనే ఆల్బమ్ గ్రామీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’గా అవార్డు సొంతం చేసుకుంది.దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద లేబుల్ లహరి మ్యూజిక్ కంపెనీ ఈ ఆల్బమ్‌ను నిర్మించింది.

 Lahari Music Divine Tides Won Grammy Award Details, Lahari Music, Divine Tides A-TeluguStop.com

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకోవడంపై లహరి మ్యూజిక్ సీఎండీ జి.మనోహర్ నాయుడు స్పందిస్తూ.‘‘సంగీత మేధావులు స్టీవర్ట్ కోప్ ల్యాండ్ మరియు రికీ కేజ్ అసాధారణ సహకారం గుర్తించబడకుండా ఉండదు.‘డివైన్ టైడ్స్’ అనే ఆల్బమ్‌ను లహరి మ్యూజిక్ నిర్మించింది.బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ అనేది మాకు ఖచ్చితంగా గొప్ప విజయం.భారతదేశం గుర్తించబడటానికి.

కళ యొక్క అన్ని రంగాలలో ప్రపంచ పటంలో ఉంచడానికి ఇది సరైన సమయం’’ అని పేర్కొన్నారు.

ఈ అవార్డుతో రెండవ గ్రామీ అవార్డు అందుకున్న రిక్కీ అందరికీ నమస్కరిస్తూ.

‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌ను 5 సార్లు గ్రామీ అవార్డు విజేత, లివింగ్ లెజెండ్ మరియు ఆల్ టైమ్ గొప్ప డ్రమ్మర్‌లలో ఒకరైన స్టీవర్ట్ కోప్ ల్యాండ్‌తో కలిసి రూపొందించడమనేది నాకు అద్భుతమైన అనుభవం.నా చిన్నతనం నుంచీ స్టీవర్ట్స్ సంగీతాన్ని వింటూ పెరిగాను.

అలాంటిది ఇప్పుడు అతనితో కలిసి ఒకే వేదికపై అవార్డును గెలుచుకోవడం నమ్మలేకపోతున్నాను.మాకు ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

నేను ఈ అవార్డును 75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశానికి అంకితం చేస్తున్నాను.’’ అని తెలిపారు.

కాగా, 2015లో ‘విండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బమ్‌తో రిక్కీ మొదటి గ్రామీ అవార్డును అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube