ఒక వ్యక్తి తాను నిద్రలో మరణిస్తానని భావిస్తూ పడుకోవడం మాసేశాడు.ప్రతి రోజూ అతను రెస్టారెంట్‌లో రాత్రి గంటల తరబడి కూర్చుంటాడు.
బ్రిటన్‌లో నివసిస్తున్న 46 ఏళ్ల డేవిడ్ నీల్‌కి నిద్రంటే చచ్చేంత భయం.నిద్రపోతున్నప్పుడు చనిపోతానేమోనని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు.నిజానికి డేవిడ్ నిద్ర-సంబంధిత మూర్ఛ రుగ్మతతో బాధపడుతున్నాడు.దీని వల్ల రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోవచ్చని అతను భయపడుతున్నాడు.అటువంటి పరిస్థితిలో ఈ ‘మరణ భయం’ నుండి దూరంగా ఉంటూ.తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అతను ప్రతిరోజూ రాత్రిపూట మెక్‌డొనాల్డ్స్‌కి గంటల తరబడి అక్కడ కూర్చుంటాడు.‘ది మిర్రర్‘ నివేదిక ప్రకారం, డేవిడ్ నీల్ ప్రతిరోజూ రాత్రి మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లి అక్కడ కాఫీ తాగుతాడు.తనను తాను నియంత్రించుకునేందుకు చుట్టుపక్కలవారితో మాట్లాడతాడు.
డేవిడ్ పరిస్థితిని తెలుసుకున్న మెక్‌డొనాల్డ్ సిబ్బంది అతనితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.అతనికి పూర్తి మద్దతునిస్తారు.
నిద్రపోతున్నప్పుడు పక్షవాతం వస్తుందనే ఆలోచనే డేవిడ్‌ని మెలకువగా ఉంచుతుంది.ఏదో ఒకరోజు నిద్రపోతానినీ, ఇక లేవలేనని డేవిడ్ అనుకుంటారు.డేవిడ్ 7 సంవత్సరాల వయస్సు నుండి ఈ రుగ్మత (నిద్ర-సంబంధిత ఎపిలెప్సీ)తో బాధపడుతున్నాడు.డేవిడ్ ఇలా అంటాడు ‘నేను ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కూడా భయం వేస్తుంటుంది.
నేను నిద్రకు దూరంగా ఉండే ఉద్దేశ్యంతో మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్తాను.దీన్ని ఎప్పుడు.
ఎలా ప్రారంభించానో నాకే తెలియదని డేవిడ్ అన్నాడు.డేవిడ్ కొన్నిసార్లు నాలుగు గంటలపాటు మెక్‌డొనాల్డ్స్‌లో కూర్చుంటాడు.
డేవిడ్ తెలిపిన ప్రకారం మెక్‌డొనాల్డ్ స్టోర్ సిబ్బంది నన్ను చాలా బాగా చూసుకుంటారు.వారిలో చాలామందికి నా ఆందోళన స్థాయి తెలుసు.
వారు నన్ను అర్థం చేసుకుంటారన్నాడు.కాగా అర్ధరాత్రి చనిపోతాననే భయం డేవిడ్‌కు వయస్సుతోపాటు మరింతగా పెరిగింది.







