దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలను అరి కట్టాల్సిన అవసరం ఉంది రాజకీయ పరమైన పోరాటం ద్వారా అవినీతి ని ఎదుర్కోవాలి ఎర్ర జెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సిపిఐ, సిపిఎం కలవాలి.కేరళలో జరిగే సభలో ఈ అంశాన్ని చర్చించి… కలిసేలా తీర్మానం చేస్తాం మోడీ మంత్ర జాలంతో అబద్దాలను నిజం చేస్తున్నారు బిజెపి తీసుకున్న రైతు చట్టాలను పంజాబ్ లో తిరస్కరించారు.
కానీ ఇతర రాష్ట్రాలలో కక్ష సాధింపు చర్యలకు మోడీ దిగుతున్నారు SBI నిన్న అదానీ అప్పులను మాఫీ చేయడాన్ని ఎలా చూడాలి రుణం అవసరమైన అర్హులకు ఇవ్వరు… ఎగ్గొట్టేవారికి మాత్రం రుణాలు రద్దు చేస్తారా.
ప్రైవేటు సెక్టార్ లో కూడా అదానీ నే ఉండాలా జివికె రెడ్టి పై కక్ష సాధిస్తూ.
అదానీకి సముద్ర తీర ప్రాంతాన్ని కట్ట పెట్టారు మోడీ, జగన్ లు అదానీకి ఊడిగం చేస్తూ.ప్రభుత్వ ఆస్తులను అప్పగించారు.ముంద్రా పోర్ట్ ద్వారా మత్తు పదార్థాల రవాణా జరుగుతుంది జల రవాణా ద్వారా అనేక అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి పవన విద్యుత్, సోలార్ విద్యుత్ అదానీకే ఎక్కువుగా ఉంది అదానీ ని నెత్తిన పెట్టుకుని ఆర్ధిక వ్యవస్థ ను కట్టబెడుతున్నారు.చిలక పలుకులు పలికే నిర్మలా సీతారామన్ కి ఇవేమీ తెలియవాప్రజా వ్యతిరేక విధానాల పై వామపక్ష పార్టీలు పోరాటం చేస్తాయి బిజెపి కి సహకరించాలని భావించిన కేసీఆర్ నే ముంచాలని చూశారు.
తెలంగాణ లో అధికారం లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు బిజెపి కి వ్యతిరేకంగా కేసిఆర్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో బిజెపి వ్యతిరేక పార్టీ లను ఏకం చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
ఎపి సిఎం, వైసిపి ఎంపీలు మాత్రం మోడీ కాళ్ల పై సాష్టాంగ పడుతున్నారు ప్రజా వ్యతిరేక చట్టాలను జగన్ ఎందుకు అమలు చేస్తున్నారు.151సీట్లు ఇచ్చినా… జగన్ ఇంత బానిస బతుకు అవసరమా బిజెపి కనుసన్నల్లో నీ పాలన సాగుతుందా వారి విధానాలకు అనుగుణంగా ప్రజల పై భారాలు మోపుతారా మద్య నిషేధం అన్న జగన్ సారాయిని ఏరులై పారిస్తున్నారు చంద్రబాబు కు 23సీట్లు అయినా వచ్చాయి… జగన్ కు అవి కూడా రావు జగన్ ఆయన చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తారా ఆయనే రద్దు చేస్తారు.మళ్లీ ఆయనే అమలు చేస్తారా విటన్నింటికి గవర్నర్ ఆమోదం ఎలా తెలుపుతున్నారు.
నేనే గవర్నర్ గా ఉంటే ఆత్మహత్య చేసుకునే వాడిని కేంద్రం కూడా ఆమోదించబట్టే గవర్నర్ ఇలాంటి నిర్ణయాలకు సంతకాలు చేస్తున్నారు జగన్ పాలన పై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయి







