మాజీ IPS సజ్జనార్ అందరికీ సుపరిచితుడే.అనేక మంది క్రిమినల్స్ ను మట్టుపెట్టిన డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్ ను తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల అతన్ని RTC ఎండీగా నియమించిన సంగతి తెలిసినదే.
అయితే ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.తెలంగాణాలో ఇతగాడు ఓ సింహస్వప్నం.
దానికి అతని చరిత్రే కారణం.వరంగల్ లో కాలేజీ యువతులపై యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో ఆయన అక్కడ ఎస్పీగా పని చేయడంతో ఆ సమయంలో సజ్జనార్ పేరు మీడియాలో మార్మోగింది.
ఇక దాని తరువాత దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ తో ఆయన పేరు మరోసారి హాట్ టాపిక్ అయిన విషయం తెలిసినదే.ఇక అసలు విషయంలోకి వెళితే, సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అక్కడ కూడా ఆయన తన ఉనికిని చాటుకుంటున్నాడు.
కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెట్టి సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటున్నారు.ఆర్టీసీ సంస్థను ప్రమోట్ చేసేలా ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చూస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఓ ఫోటోని తాజాగా ఆయన షేర్ చేసారు. హైదరాబాద్ లోని ఓ ప్రాంతాన్ని డ్రోన్ సహాయంతో తీసిన ఫొటోని షేర్ చేసి, ఆ ఫొటో ఎక్కడిదో చెప్పండంటూ ఆయన నెటిజన్లకు ఓ ప్రశ్న విసిరారు.అయితే ఈ ఫొటో కూడా ఆర్టీసీకి సంబంధించిన ప్రశ్నే కావడం విశేషం.
అయితే.చుట్టూ ఆగి ఉన్న బస్సుల ఆధారంగా దాన్ని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ గా గుర్తించి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.







