బాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పేరు సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు షాహిద్ కపూర్ గురించి మనకు తెలిసిందే.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఈ నటుడు తాజాగా ఒక విలాసవంతమైన కొత్త కారును కొనుగోలు చేశారు.
ఈ క్రమంలోనే తన కారుకు సంబంధించిన ఫోటోలను వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇక షాహిద్ కపూర్ వైట్ కలర్ మెర్సిడెస్ మేబాచ్ ఎస్-580 కారును కొనుగోలు చేశారు.
ఎంతో అద్భుతమైన ఫీచర్స్ విలాసవంతమైన ఈ కారును సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇక ఈ కారును డ్రైవింగ్ చేస్తూ ఉన్న వీడియోని షాహిద్ కపూర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఫాలింగ్ బ్యాక్ బ్యాచ్ అని క్యాప్షన్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక షాహిద్ కపూర్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.హిందీలో కూడా ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.







