1.నాట్స్ ఆధ్వర్యంలో బాలల సంబరాలు
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ హుస్టన్ లో బాలల సంబరాలను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది కి పైగా పాల్గొన్నారు.
2.ట్విట్టర్ లో అతి పెద్ద వాటాదారునిగా ఎలన్ మాస్క్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ అతి పెద్ద వాటా దారునిగా నలిచారు.ట్విట్టర్ లో 9.2 శాతం వాటా ను కలిగి ఉన్నట్లు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ లో దాఖలు చేసిన ఫైలింగ్ లో ఎలన్ మాస్క్ ఈ విషయం ప్రకటించారు.
3.ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ ను ప్రతిపాదించిన ఇమ్రాన్
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరుని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.
4.చైనాలో కరోనా ఉధృతి .రంగంలోకి సైన్యం

చైనా లో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది.ఈ రోజు చైనాలో 13 వేల కి పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.షాంఘై లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.అలాగే సైన్యాన్ని రంగంలోకి దించారు.
5.కాలిఫోర్నియా లో కాల్పులు.13 మంది మృతి

కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు.మరికొందరు గాయాల పాలయ్యారు.ఈ కాల్పులకు పాల్పడింది ఎవరు అనేది ఇప్పటి వరకు అంతుపట్టలేదు.
6.శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభం

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి రాజకీయ సంక్షోభం తోడయ్యింది.నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.దీంతో ప్రజాగ్రహం తీవ్రతరం కావడంతో క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు.







