మామూలుగా కొత్త సినిమా వస్తుంది అన్నా, లేదంటే కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ వస్తోంది అంటే మీమ్ మేకర్స్ వారి టాలెంట్ కి పని చెప్పి కొత్త కొత్తగా మ్యూజిక్ లతో మీమ్స్ ని రూపొందిస్తూ ఉంటారు.ఇక నిత్యం సోషల్ మీడియాలో కొన్ని వందల మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక ఈ మీమ్స్ ని చూసి నెటిజన్ లు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ప్రస్తుత జనరేషన్ లో రీల్స్ కంటే మీమ్స్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ నెటిజన్స్ ని కడుపుబ్బ నవ్విస్తున్నాయి.ఆ మీమ్ ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించినవి.
కొంతమంది క్రియేటివ్ మీమర్స్ వైన్ షాప్ లో ఆర్ఆర్ఆర్ అంశం గురించి వివరించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో దర్శకుడు రాజమౌళి ది ఫైర్ ది వాటర్ కార్యకర్తల కలయికను ప్రదర్శించడం ద్వారా సినిమాను ఎలా వివరించారో తెలిసిందే.
తాజాగా అదే కాన్సెప్ట్ తో ఒక మీమర్ ఒక వీడియోను రూపొందించాడు.ముందుగా వైన్ షాప్ లో ఓ వ్యక్తి ఓ టేబుల్ పై కూర్చుంటాడు.గ్లాసులో మందు పోసుకొని వాటర్ బాటిల్ తీస్తాడు.అయితే అప్పటికే అందులోని నీళ్లు అయిపోతాయి.
చుక్క కూడా రాదు.అప్పుడు ఇంకొక వ్యక్తి టేబుల్ పై కూర్చున్న మరొక వ్యక్తి సిగరెట్ తాగాలి అనుకుంటాడు.
తీసి నోట్లో పెట్టుకుంటాడు.కానీ వెలిగేంచేందుకు ఆతడి వద్ద లైటర్ ఉండదు.అయితే వారిద్దరూ ఒకరినొకరు గమనించుకొని పలకరించుకుంటారు.ఒకరి దగ్గర ఉన్న నీళ్లను మరొకరికి ఇచ్చి అతడి వద్దనున్న మంటను అతను తీస్కుంటాడు.ఇలా ఈ వీడియోను పూర్తి చేశాడు మీమర్.అయితే ఇది చూసిన వారంతా కడుపుబ్బా నవ్వుతున్నారు.
అయితే ఈ మీమ్ చూసిన వాళ్లంతా ఇది చాలా క్రేజీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.