ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తనకు ఏ మాత్రం సమయం దొరికినా తన కూతురు అర్హ, కొడుకు అయాన్ తో కలిసి ఎంతో సరదాగా గడుపుతారు.ఇక పిల్లలతో కలిసి అల్లు అర్జున్ గడిపే ఆ సమయాన్ని కెమెరాల్లో బంధిస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా నిత్యం తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్ల వీరి పిల్లలకి కూడా సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ తో పోలిస్తే అర్హ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇక తన కొడుకు పట్ల అల్లు అర్జున్ కి ఎంత ప్రేమ ఉందో తన పుట్టినరోజు సందర్భంగా తన కొడుకు పై ఉన్న ప్రేమను బయట పెట్టారు.ఏప్రిల్ 3వ తేదీ అల్లు అర్జున్ కొడుకు పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక మెమొరబుల్ పిక్ షేర్ చేస్తూ తన కొడుకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ ద్వారా అల్లు అర్జున్ స్పందిస్తూ….నా జీవితం, నా కొడుకు ,నా ఆత్మ, అయాన్ ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని, రాబోయే రోజులు తన జీవితంలో ఎంతో ఆనందాలను, సంతోషాలను, నవ్వులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు అయాన్ అంటూ అయాన్ ‘వింగ్ మ్యాన్’ అనే హెడ్ బ్యానర్ ధరించి, తనతో కలిసి దిగిన ఫోటోని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున అయాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేశారు.







