గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ పక్షులుగా ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా, కరోనా కారణం వల్ల వీరి పెళ్లి వాయిదా పడింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఏప్రిల్ 2వ వారంలో వీరి వివాహం జరుగుతుందని బాలీవుడ్ కోడై కూస్తోంది.
ఇక ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇరు కుటుంబ సభ్యులు కలిపి వీరి వివాహానికి ముహూర్తం కూడా నిర్వహించారని వార్తలు వస్తున్నాయి.
అయితే వీరి వివాహ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా పెళ్లి పనులు శర వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.ఇక రణబీర్, అలియా వివాహం కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది.
ఏప్రిల్ రెండవ వారంలో వివాహం చేసుకోబోతున్న ఈ జంట వారి వివాహ విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

రణబీర్, అలియా డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా తమ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.ముంబైలోని ఆర్కే హౌస్ ను కపూర్ కుటుంబ సభ్యులు ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.రణబీర్ తల్లిదండ్రుల వివాహం కూడా ఇదే హౌస్ లో జరిగింది.
ఈ క్రమంలోనే అదే సెంటిమెంట్ తో రణబీర్ కుటుంబసభ్యులు వివాహాన్ని ఇక్కడే చేయాలని భావించినట్లు తెలుస్తోంది.ఇక ఆలియా రణబీర్ కూడా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తూ డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా వీరి వివాహ బాధ్యతలను వారి కుటుంబ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది.







