మన టాలీవుడ్ లో అనిల్ రావిపూడి కి ప్రత్యేక స్టార్ డమ్ ఉంది.ఈయన తన కెరీర్ లో ఇంత వరకు పరాజయం పొందలేదు.
అందుకే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఖచ్చితంగా ఉంటాడు.ఈయన ఒక్కో సినిమాతో తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు.
ఈయన సినిమాలంటే కామెడీ పక్కాగా ఉంటుంది.
కామెడీ మాత్రమే కాదు యాక్షన్, లవ్, ఎమోషన్ కూడా సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.
అందుకే అనిల్ రావిపూడి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతూ ఉంటారు.ఈయన సినిమాలన్నీ హిట్ టాక్ మాత్రమే రావడంతో ఈయన సినిమా చేసేందుకు కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరు ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రెసెంట్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తునందు.ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.ఎఫ్ 2 సూపర్ హిట్ అవ్వడంతో ఈయన ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 చేస్తున్నాడు.
ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
ఇక ఈయన ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.బాలయ్య ప్రెసెంట్ గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి అయినా తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ లోపు అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 3 సినిమా రిలీజ్ చేసి బాలయ్యతో సినిమా కోసం రెడీ గా ఉంటాడు.
అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అయ్యింది.అనిల్ రావిపూడి బాలయ్య తో సినిమా చేసిన తర్వాత్ అబ్బాయి ఎన్టీఆర్ ను లైన్లో పెడుతున్నట్టు తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈ సినిమా తర్వాత ఈయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఉప్పెన డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు తో కానీ లేదంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కానీ సినిమా చేయవచ్చని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు అయితే అనిల్ రావిపూడి బాలయ్య తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఎన్టీఆర్ కూడా కొరటాల తర్వాత అనిల్ తో సినిమా చేయడమే మంచిదని అనుకుంటున్నాడట.ఎందుకంటే అనిల్ రావిపూడి చెప్పిన కథలో ఎన్టీఆర్ కు కొత్తదనం కనిపించడం ఇంతవరకు అలాంటి సబ్జెక్టు చేయకపోవడంతో ఈయనకే ఓటు వేసాడట.ఇదే నిజం అయితే బాబాయ్ సినిమా పూర్తి అవ్వగానే అబ్బాయితో మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు అనిల్ రావిపూడి.







