మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ ఈ వయసులో కూడా అంతా యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.
ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.
ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
ఈ సినిమాతో సమ్మర్ సీజన్ ను ఆక్రమించాడు.సమ్మర్ మన టాలీవుడ్ సినిమాలకు కీలకం అనే చెప్పాలి.
ఈ కీలకమైన సీజన్ లో చిరు ఆచార్య సినిమాతో రానున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరికొన్ని సినిమాలను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతుంది.ఈ సినిమాను దసరా సీజన్ కు లైన్లో పెట్టాడు.మరి దసరా సీజన్ పెద్ద సీజన్ లలో ఒకటి.దీంతో ఈ సినిమాతో వచ్చి చిరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు.సిస్టర్ సెంటిమెంట్ సినిమా కావడంతో ఈ సినిమాలో చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ ను తీసుకున్నారు.
అలాగే తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

దీంతో పాటు చిరంజీవి మరొక రీమేక్ సినిమాతో సంక్రాంతి సీజన్ లో రాబోతున్నాడు.మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫెర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ రాజా డైరెక్ట్ చేస్తునందు.
అంతేకాదు అతిథి పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.ఇలా మూడు సినిమాలతో చిరు ఎం,మూడు అతిపెద్ద సీజన్ లను ఆక్రమించాడు.మరి ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో వేచి చూడాల్సిందే.








