టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అరవింద్ కుమారులు అనగానే మనకు అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే గుర్తుకు వస్తారు.
కానీ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అయిన అల్లు బాబీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.చాలామందికి అల్లు బాబీ ఎవరు అన్నది కూడా తెలియదు.
ఇకపోతే అల్లు బాబి ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు అల్లు బాబీ.ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్ గతంలో మీరు ప్లేట్లు కడిగారట కదా అంటూ ఆనాటి ఘటన గురించి ప్రశ్నించగా.
ఈ విషయంపై స్పందించిన అల్లు బాబీ తనదైన శైలిలో సమాధానమిస్తూ.అవును 1994 సమయంలో తాను ఆస్ట్రేలియాకు వెళ్లానని, అప్పుడు తన వయసు 17 ఏళ్లు అని, ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ సమయంలో అక్కడ చదువుకోవడం తో పాటుగా కొంత సమయం పని చేసుకోవడానికి కూడా వీళ్లు ఉండేదని, ఆ సమయంలో అతడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని ఎంచుకున్నారట.

ఈ క్రమంలోనే అల్లు బాబి కి హోటల్లో వెయిటర్ గా అవకాశం వస్తే వెళ్లానని, కానీ అప్పుడు ముందుగా ప్లేట్లు కడగడం నేర్చుకోమని చెప్పారని, ఆ సమయంలో తాను ఆ పని చేసినట్లు అల్లు బాబి మీడియాకు వెల్లడించారు.అలా అప్పట్లో పేరు కలిసి వచ్చింది అని కడిగిన తర్వాత ఆ హోటల్లో వెయిటర్ గా మారానని, అంతేకాకుండా అప్పట్లో కాల్ సెంటర్ లో పని చేయడం, ఫ్యూయల్ స్టేషన్ లో పనిచేయడం ఇలాంటి పనులు కూడా చేశాను అని అల్లు బాబి చెప్పుకొచ్చారు.

ఆ పనులన్నీ కూడా తాను ఖరీదైన స్పోర్ట్స్ కారులో తిరుగుతూ చేసినట్లు తెలిపారు.అయితే తాను పని చేస్తున్న సమయంలో తన తండ్రి కావాల్సినంత డబ్బు పంపినప్పటికీ తాను మాత్రం సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలి అనుకున్నానని, అందుకోసం అలా హోటళ్లలో పని చేశాను అని తెలిపాడు అల్లు బాబీ.ఆ సమయంలో తనను తన తండ్రి అల్లు అరవింద్ కూడా బాగానే ప్రోత్సహించారని తెలిపాడు.







