కొత్త జిల్లాల ప్రకటనకు సంబంధించి వైసీపీ క్యాడర్ కి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ఆదేశాలు..!!

నేడు 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం జగన్ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా శుక్రవారం ఈ ప్రకటనకు సంబంధించి వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు జడ్పీ చైర్ పర్సన్ లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ లతో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

 Sajjala Ramakrishnareddy Gives Key Directions To Ycp Cadre Regarding Announcemen-TeluguStop.com

కొత్త జిల్లాల ఏర్పాటు ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వారం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.వికేంద్రీకరణ లో భాగంగానే రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయలు ఏర్పాటు చేయడం జరిగిందని.

పేర్కొన్నారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రతి ఇంటి  గడపకు వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని సజ్జల స్పష్టం చేశారు.

దీంతో జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో స్థానికంగా ఉండే విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేసుకుని వారం పాటు కొత్త జిల్లాల ఏర్పాటు ను పండుగల నిర్వహించాలని సూచించారు.అధికార యంత్రాంగం కూడా సంస్కృతి శాఖ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.

ఇక మే నెల నుండి గడపగడపకు వెళ్లి కార్యక్రమాన్ని చేపట్టాలని సజ్జల పేర్కొన్నారు.పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని కలుపుకుని బూత్ కమిటీల కు సంబంధించి సమీక్ష చేసుకుని.

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.గడపగడపకు వెళ్లే కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేయాలని పార్టీ క్యాడర్ కి సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube