నేరేడు పండ్లు.వీటి గురించి కొత్తగా వివరించి చెప్పక్కర్లేదు.
ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే నేరేడు పండ్లలో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
అలాగే చర్మ సౌందర్యానికి కూడా నేరేడు పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.మరి నేరుడు పండ్లను చర్మానికి ఎలా వాడాలి.? అసలు ఇవి ఏయే స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను అందిస్తాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు.
యుక్త వయసు వచ్చిందంటే చాలు యువతీ, యువకులను తీవ్రంగా మదన పెట్టే సమస్య ఇది.అయితే మొటిమలను సులభంగా నివారించడంలో నేరేడు పండ్లు గ్రేట్‌గా హెల్ప్ చేస్తాయి.అందుకు ముందుగా ఐదారు నేరేడు పండ్లను తీసుకుని గింజ తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి మొటిమలు ఉన్న చోటే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేయాలి.
బాగా ఆరిన తర్వాత వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా మూడు రోజులు వరసగా చేస్తే మొటిమలు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే గుప్పెడు గింజ తొలగించిన నేరేడు పండ్లను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ శెనగ పిండి, రెండు టేబుల్ స్పూన్లు నేరుడు పండ్ల జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ చేసి కలుపుకుని.ముఖానికి పట్టించాలి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి అప్పుడు నార్మల్ వాటర్‌తో క్లీన్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మ ఛాయ పెరుగుతుంది.
ముఖంపై ఏమైనా మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.మరియు స్కిన్ గ్లోయింగ్ కూడా మారుతుంది.







