మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.
ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ‘ సినిమా రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది.
ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా‘ సినిమా చేస్తున్నాడు.ఇక వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలోరామారావు ఆన్ డ్యూటీఅలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాను చేస్తున్నాడు.
ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.1970 స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ మేకర్స్ రివీల్ చేసారు.ఈ సినిమా ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అలాగే అదే రోజున ఈ సినిమా ప్రీ లుక్ కూడా రివీల్ చేయనున్నారని తెలిపారు.ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అయిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు.







