టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ యువనాయకుడు నారా లోకేష్.ఒక రాజకీయ నాయకుడిగా సరైన విమర్శలు చేయడంలో నారా లోకేష్ పరిపక్వత ఇటీవల కాలంలో స్పష్టంగా కనబడుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలకు, గత రెండేండ్లకు పైగా లోకేష్ మాట్లాడుతున్న విధానంలో మార్పులు ఇట్టే గమనించొచ్చు.వైసీపీ తీరును ప్రజలకు అర్థం అయ్యేలా ఎండకట్టడంలో లోకేష్ ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి.
ఒకప్పుడు లోకేష్ ప్రసంగాలకు పెదవి విరిసిన టీడీపీ నేతలు ప్రస్తుత మార్పుతో కొంత జోష్‌లో ఉన్నట్టు సమాచారం.అయితే లోకేష్ కు ప్రస్తుతం పెద్ద సవాలే ఎదురుకానుందా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆయనకు క్లాస్ నాయకుడిగా పేరుంది.జగన్‌పై ఎన్ని రకాలుగా విరుచుకుపడినా, ఎన్ని విమర్శలు చేసినా క్లాస్ పేరు నుంచి బయటపడని పరిస్థితి ఉంది.ఇది ఆయనకు రాజకీయంగా అడ్డువస్తుందనే వాదన కూడా ఉంది.ఎలాగైనా క్లాస్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్‌గా పేరు తెచ్చుకునేందుకు లోకేష్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే లోకేష్ ఏపీలో ఎక్కడికి వెళ్లినా.ఎక్కడ ప్రసంగాలు చేసినా క్లాస్ పీపుల్ మాత్రమే ఆయనను ఫాలో అవుతున్నారు.
మాస్ జనాలు మాత్రం చేరువకావట్లేదు.ఇక ఇతర పార్టీల పరంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లాస్‌గా ఉండాలని ప్రయత్నించినా మాస్ పీపుల్ మాత్రం ఆయనను వీడడం లేదు.
పవన్ను జనసేనాని అని పిలుస్తుంటారు.ఇక సీఎం జగన్ కు కూడా మాస్ నాయకుడిగా పేరుంది.
ఆయనను జగనన్న అని పిలుచుకుంటారు.ఇలా వారికి మాస్ ఇమేజ్ బోలెడంత ఉంది.
ఇదే తరహాలో లోకేష్ కూడా మాస్ ఇమేజ్ కోసం యత్నిస్తున్నారు.తన విమర్శల్లో సామాన్యులకు అర్థమయ్యే భాషనే వాడుతున్నారు.

మొత్తంగా జగన్‌పై ఎన్ని జోకులు పేల్చినా.ఎన్ని విమర్శలు చేసినా లోకేష్ మాత్రం మాస్ పీపుల్‌కు చేరువవ్వట్లేదు.తాజాగా టీడీపీ 40వ ఆవిర్భావ వేడుక వేదికలో లోకేష్ మరోసారి మాస్ జనాలను ఆకర్షించేందుకు యత్నించారు.ఏకంగా సినిమా డైలాగులతో జగన్‌పై విరుచుకుపడ్డారు.ఈక్రమంలో సీనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా, టీడీపీ అధినేత చంద్రబాబును రాముడిగా పోల్చి తనను మాత్రం మూర్ఖుడిగా అభివర్ణించుకున్నారు.మొత్తంగా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తమ పార్టీ కార్యకర్తలను ఏడిపించిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.ఓవరాల్‌గా లోకేష్ ప్రసంగం అంతా ఇటు టీడీపీలోను .ఏపీలోనూ చర్ఛణీయాంశంగా మారాయి.మరి లోకేష్ మాస్ జనాలకు ఎంతమేర దగ్గరవుతారో ? వేచి చూడాలి.







