మెడ న‌లుపును 3 రోజుల్లో త‌గ్గించే ఎఫెక్టివ్ రెమెడీ.. రిజ‌ల్ట్ అదుర్స్ అంతే!

సాధార‌ణంగా కొంద‌రి ముఖం ఎంతో తెల్ల‌గా, మృదువుగా, అందంగా మెరిసిపోతుంటుంది.కానీ, మెడ మాత్రం న‌ల్ల‌గా, కాంతిహీనంగా క‌నిపిస్తుంది.

 Effective Home Remedy For Dark Neck! Effective Home Remedy, Dark Neck, Latest Ne-TeluguStop.com

మురికి, మృత క‌ణాలు పేరుకుపోవ‌డం, శ‌రీరంలో అధిక వేడి, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఆహార‌పు అల‌వాట్లు, ఎండ‌ల ప్ర‌భావం, కాలుష్యం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మెడ న‌ల్ల‌గా మారుతుంది.దాంతో మెడ న‌లుపును వ‌దిలించు కోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే వివిధ క్రీముల‌ను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే ఏం చేయాలో తెలియ‌క మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే మూడు రోజుల్లోనే మెడ న‌లుపు త‌గ్గ‌డాన్ని మీరు గ‌మ‌నిస్తారు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల స‌గ్గు బియ్యం వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల స‌గ్గు బియ్యం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ షుగ‌ర్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, మూడు టేబుల్ స్పూన్ల‌ ట‌మాటో జ్యూస్‌, హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె వేసి అన్ని క‌లిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు ప‌ట్టించి.రెండు నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆపై వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుని వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.అనంత‌రం ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.ఇలా వ‌రుస‌గా మూడు రోజులు చేస్తే రిజ‌ల్డ్ చూసి మీరే ఆశ్చ‌ర్య‌పోతారు.ఎందుకంటే, అంత త్వ‌ర‌గా మెడ న‌లుపు వ‌దిలిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube