మనలో చాలా మంది ఏదోఒక వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు.కానీ అధిక వ్యయం కారణంగా, వారు వ్యాపారాన్ని ప్రారంభించలేరు.
అయితే మీరు వేల రూపాయల వ్యయంతో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, అధిక లాభాలను అందించే గిఫ్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.ఈ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.
మహిళలు కూడా దీన్ని ఇంటి నుండి నిర్వహించవచ్చు.మహిళలు ఇంటి పనులు చేసిన తర్వాత పార్ట్‌టైమ్‌గా ఈ వ్యాపారం చేయవచ్చు.
అదే గిఫ్ట్ బాస్కెట్ వ్యాపారం.ప్రస్తుతం గిఫ్ట్ బిజినెస్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.
ఈ రోజుల్లో చాలామంది ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు బహుమతులు ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు.ఈ నేపధ్యంలో గిఫ్ట్ బాస్కెట్ వ్యాపారం మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ఈ వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలామంది ప్రతి ప్రత్యేక సందర్భంలో ఒకరికొకరు చాక్లెట్లు, అలంకరణ వస్తువులు మొదలైనవాటిని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ బహుమతి వస్తువులను ఉంచేందుకు మార్కెట్‌లో గిఫ్ట్ బాస్కెట్‌లకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది.బహుమతులు ఇచ్చేవారు తాము ఇవ్వాల్సిన బహుమతిని బాస్కెట్‌లో ప్యాక్ చేసి పైన కవర్ వేస్తారు.
గిఫ్ట్ బాస్కెట్ వ్యాపారానికి రిబ్బన్, కాగితం, స్థానిక ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులు, ప్యాకింగ్ మెటీరియల్, ఫాబ్రిక్ పీస్, వైర్ కట్టర్, మార్కర్ పెన్, జిగురు, కలరింగ్ టేప్ మొదలైనవి అవసరం.అలాగే అనేక అలంకరణలు, ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులు అవసరం.
దీనితో పాటు మీకు కొన్ని పెట్టెలు కూడా అవసరం.ఇందుకోసం 5,000 వేల రూపాయల నుండి 10,000 వేల రూపాయల పెట్టుబడి అవసరం.ఈ విధంగా తయారు చేసిన ఒక్కో బుట్టను రూ.100 వరకు అమ్మవచ్చు.రూ.50 వేల చిన్న పెట్టుబడిలో రూ.50 వేల రూపాయల వరకూ పొందవచ్చు.







