ఏపీలో ఆయన వివాద రహిత నాయకుడు.సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది.
ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా పేరు గడించాడు.ఆయనకు మాత్రం ఓ బలమైన కోరిక ఉంది.
ఒక్కసారైనా మంత్రి పదవి దక్కించుకుని మంత్రిగా పిలిపించుకోవాలని కుతూహలంతో ఉన్నాడు.నేటికీ ఆయన కోరిక తీరలేదు.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు.ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు వైఎస్‌కు అనుకూలవర్గంలో చేరి చక్రం తిప్పిన ఘనుడు కూడా ఆయనే.
ఇలాంటి ముఖ్యనేత వైఎస్‌ను బతిమాలుకున్నా ఆయనకోరికను తిరస్కరించడం గమనార్హం.ఆయనే కాటసాని రాంభూపాల్‌రెడ్డి.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చారు. వైసీపీ నుంచి ఆఫర్ రాగా తిరస్కరించారు.
ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసీ ఓటమిపాలయ్యారు.తరువాత బీజేపీలో చేరనా అక్కడ ఇమడ లేకపోయారు.
గత ఎన్నికలకు ముందు పాణ్యంలో చోటుచేసుకున్ననాటకీయ పరిణామాల నేపథ్యంలో కాటసాని వైసీపీలో చేరారు.అప్పటి వరకు వైసీపీలో ఉన్న చరితారెడ్డి టీడీపీకి వెళ్లారు.
ఆమెపై కాటసాని విజయం సాధించారు.నాటి నుంచి మంత్రి వర్గంపై కాటసాని ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు కూడా చేశారు.
కానీ, కర్నూలు నుంచి పార్టీ తరపున పనిచేసిన వారికే ప్రాధాన్యం దక్కింది.ఇప్పుడు మళ్లీ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.
త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో తన స్నేహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చక్రం తిప్పుతున్నారని సమచారం.మొత్తంగా ఆయన సీనియర్ కావడం, రాజకీయ అనుభవం ఉండడం వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు.

ఇప్పటికే కడప జిల్లా రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని తీసుకుంటారని సమాచారం.నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇటీవల మరణించిన మంత్రి గౌతంరెడ్డి సతీమణికి రిజర్వ్ చేశారట.ఈ నేపథ్యంలో రెడ్లను ఎక్కవ సంఖ్యలో చేర్చుకుంటే ప్రమాదమని భావిస్తున్నారట.రాబోయే ఎన్నికల దృష్ట్యా కేబినెట్‌లో రెడ్ల సంఖ్యను తగ్గించాలని యోచిస్తున్నారని టాక్.ఇక కాటసాని కష్టం వృథానే అని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు.చివరి నిమిషంలో జగన్ కరునిస్తే తప్ప కాటసాని కల నెరవేరడం కలేనని ఆయన అనుచరులే పేర్కొంటున్నారు.
మరి కాటసానికి మంత్రి పదవి లభించేనా ? లేక షరామామూలే అనే చందంగా మారుతుందా ? అనేది వేచి చూడాలి.







