యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగు సంవత్సరాల తర్వాత ఆర్.ఆర్.
ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను ఆనందింప చేశాడు.అరవింద సమేత సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం లో సినిమా మొదలు పెట్టిన ఎన్టీఆర్ సినిమా కోసం ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కి చెక్కి ఆర్ ఆర్ ఆర్ సినిమా ని ఏకంగా మూడు సంవత్సరాల పాటు తెరకెక్కించాడు.సినిమా రావడానికి మరో ఏడాది అదనంగా పట్టింది.
కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అయింది.ఇక ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయం లో ఎలాంటి ఆలస్యం ఉండదు అంటూ ఆయన అభిమానుల నుండి సమాచారం అందుతుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించి ఎలాంటి మైనస్ ఎన్టీఆర్ విషయంలో లేదు.
కనుక కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కనుక ఈ సినిమా కు సంబంధించి మరింత అంచనాలు ఉండే అవకాశాలున్నాయి.ఈ సినిమా ను కొరటాల శివ మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని మరియు ఎన్టీఆర్ కి సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
కొరటాల దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమా లో హీరోయిన్ గా జాన్వికపూర్ లేదా ఆలియా భట్ కనిపించబోతున్నట్లు గా సమాచారం అందుతోంది.

ఆ విషయంపై అధికారికంగా మరో కొన్ని రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా జూన్ నెలలో పట్టాలెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.వచ్చే నెలలో కొరటాల శివ దర్శకత్వం లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదల కాబోతోంది.
ఆ సినిమా విడుదలైన వెంటనే ఎన్టీఆర్ 30వ సినిమా కు సంబంధించిన పనులను కొరటాల శివ మొదలు పెట్టబోతున్న అని సమాచారం అందుతోంది.







