అక్కడ ఇల్లున్నా అది ఎవరికీ కనిపించదు.. ఈ మాయలోని మర్మమిదే!

ఈ ప్రపంచంలో అది ఒక విలాసవంతమైన ఇల్లు. చాలా మంది కోట్లాది రూపాయలు వెచ్చించి మరీ విభిన్నమైన ఇల్లు కట్టుకుంటారు.

 Mirror House Built In London Details, Mirror Home, London, London Mirror Home, V-TeluguStop.com

అలాంటి అనేక రకాల ఇళ్ళను మీరు చూసే ఉంటారు.కొంతమంది చాలా విచిత్రమైన శైలిలో ఇళ్లను నిర్మించుకుంటారు.

అయితే లండన్‌లో ఎవరికీ కనిపించని ఓ ఇల్లు ఉంది.ఇది వినగానే మీరు షాక్ అయివుంటారు.

ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.లండన్‌లోని ఈ ఇంటి గురించి చర్చ జరుగుతోంది.

రోడ్డు పక్కగా నిర్మించిన ఈ ఇల్లు ఎవరికీ కనిపించదు.ఈ ఇంటి ముందుకు ఎవరైనా వచ్చినప్పుడు వారు కంగారు పడతారు.

కొందరు ఆ ఇంటికి ఫోటోలు తీయడంలో మునిగిపోతారు.కానీ తమను ఎవరో గమనిస్తున్నానే విషయాన్ని వారు అస్సలు గ్రహించలేరు.

ఈ విచిత్రమైన ఇంటిని ‘వానిష్ ఘర్’ అని కూడా పిలుస్తారు.ఇప్పుడు ఈ ఇంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంటి చిత్రాన్ని ప్రముఖ సోషల్ సైట్‌లో ఒక యూజర్ షేర్ చేసారు.తాను అక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించానని, అప్పుడు ఇంటి యజమాని తనను చూశారని యూజర్ రాశాడు.

ఈ ఫొటోను చూసిన తర్వాత చాలా మంది తాము రోజూ ఇక్కడికి వెళ్తుంటామని, అక్కడ ఇల్లు ఉందని ఎప్పుడూ తెలియలేదన్నారు.ఈ ఇల్లు భారీ రిఫ్లెక్టివ్ ప్యానెల్స్‌తో తయారు చేశారు.

Telugu Alex, London, London Mirror, Mirror, Mister India, Strange, Unvisible, Va

దీని కారణంగా ఇది బయటకు పెద్ద అద్దంలా కనిపిస్తుంది.అయితే లోపలిక చూద్దామంటే ఏమీ కనిపించదు.ఈ గాజు పలకల వల్ల బయటి వారికి ఇంట్లోని వస్తువులు ఏవీ కనిపించవని ఆ ఇంటిలోనివారు తెలిపారు.చాలామంది ఈ ఇంటిని ఒక అద్దంలా భావించి తల దువ్వుకోవడం, బట్టలు సరిచేసుకోవడం లాంటి పనులు చేస్తారు.

ఈ విలాసవంతమైన ఇంటిని అలెక్స్ అనే డిజైనర్ డిజైన్ చేశారు.ఈ ఇంటి ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.ఈ ఇల్లు ‘మిస్టర్ ఇండియా’కి చెందినదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube