జగనన్న పై ప్రశంసలు గుప్పించిన నోబెల్ గ్రహీత..!

అవును, మీరు వింటున్నది నిజమే.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రపంచ స్థాయి ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో తాజాగా భేటీ అయ్యారు.

 Noble Award Winner Esther Duflo Praises Ap Cm Jagan Mohan Reddy Details, Jagan,-TeluguStop.com

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఢఫ్లో ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆర్థికవేత్త అయినటువంటి ఎస్తేర్‌ నిన్న కలిశారు.ఈ క్రమంలో వీరు ఇరువురూ పలు ఆర్థిక విషయాలు చర్చించారు.2019లో ఆర్థిక శాస్త్రంలో భారత సంతతికి చెందిన అభిజిత్‌ బెనర్జీ, మైఖేల్‌ క్రీమెర్‌తో కలిపి ఎస్తెర్‌ ఢఫ్లో నోబెల్‌ బహుమతిని అందుకున్న విషయం అందరికీ తెలిసినదే.

అభిజిత్‌ బెనర్జీ, ఎస్తెర్‌ ఢఫ్లో ఇద్దరూ భార్యాభర్తలు.

అబ్ధుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పాల్‌)కి సహ వ్యవస్థాపకురాలుగా ఆమె వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్‌ ఢఫ్లో భేటీ అయ్యారు.

సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఎస్తేర్ ఢఫ్లో మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు, ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కలిసి పని చేయనున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

Telugu Apcm, Esther Duflo, Jagan, Nobel Prize, Noble Award, Poverty, Praises, We

ఇకపోతే, పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న కార్యక్రమాలు, సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఎస్తెర్ పొగిడేశారు.క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని అర్థం చేసుకునేందుకే జగన్ పాదయాత్ర చేపట్టారని, ఈ క్రమంలో పేదలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని సీఎం జగన్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు.మెజారిటీ స్కీమ్‌లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవడం నిజంగా మెచ్చుకోదగ్గ చర్య అని ఈ సందర్భగా ఆమె అనడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube