ఇప్పటిదాకా మనం మనుషుల కోసం అత్యవసర అంబులెన్సు సర్వీసులను ఉపయోగించడం చూసాం.కానీ.
, వృక్షాల కోసం కూడా ఇప్పుడు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు.మనుషులకు ఎలాగయితే ప్రాణం ఉంటుందో చెట్లకు కూడా అలాగే ప్రాణం ఉంటుందని మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము.
అయితే మనుషుల ప్రాణాలకు విలువ నిచ్చే ఈరోజుల్లో చెట్ల ప్రాణాలకు ఎవరు విలువనిస్తున్నారు చెప్పండి.కానీ చెట్లు లేనిదే మనుషులకు మనుగడ లేదు.
చెట్లు పచ్చగా కళకళ లాడుతూ ఉంటూనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్నీ ఎవరు మర్చిపోవద్దు.చెట్లను కాపాడే ఉద్దేశ్యంతో తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.
నీరు లేక ఎండిపోతున్న చెట్లను, వ్యాధుల బారిన పడ్డ వృక్షాలను గుర్తించి వాటికి చికిత్స అందించి వాటి ప్రాణాలను కాపాడడం కోసం అంబులెన్స్సర్వీసులను ప్రారభించారు.డిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉచిత అంబులెన్సు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తూర్పు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఎండిపోతున్న చెట్లను గుర్తించి వాటిని కాపాడేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ ప్రత్యేకమైన అంబులెన్సు సర్వీసులు చెట్ల దగ్గరికి వెళ్లి వాటిని పరీక్షిస్తాయని, చెట్లకు ఏవైనా వ్యాధులు వస్తే సరైన చికిత్స అందించి వాటిని బతికిస్తాయని వివరించారు.

అలాగే అంబులెన్సులో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ద్వారా చెట్లకు ఎలా చికిత్స చేయాలో నేర్పించారు.ముందుగా వ్యాధి బారిన పడ్డ చెట్లను నీటితో శుభ్రం చేసి చెట్టు మీద ఉన్న మృత కణాలను తొలగిస్తారు.ఆ తర్వాత వ్యాధికి తగ్గా ఔషధాలు, ఎరువులు అందించి చెట్లను స్టెరిలైజ్ చేస్తారు.అలాగే చెట్లు దెబ్బతిన్న చోట థర్మాకోల్‌తో నింపిన ఇనుప కంచెను అమర్చడం జరుగుతుంది.
ఆ తరువాత పీఓపీ కోటింగ్ వేస్తారు.అలా వేయడం వలన గాలి లోపలికి వెళ్ళదు.
ఫలితంగా లోపల చెట్ల కణాలు పెరుగుతాయి.వాటి కాండాలు బలంగా తయారవుతాయట.
ఇప్పటికే చెన్నైలో ఇలాంటి ట్రీ అంబులెన్సులను ఉపయోగిస్తున్నారు.







