వయసుపైబడిన తగ్గేదే లే అంటున్న బిగ్ బీ... డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Amitabh Bachchan Performs His Own Action Sequence Without Dope Amitabh Bachchan,-TeluguStop.com

ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా అమితాబ్ నటించిన “ఝుండ్” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదల కాగా, సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమితాబ్ ఏడు పదుల వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్-ప్యాక్డ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ యాడ్ షూట్ లో భాగంగా మూడు గాజు పలకలను పగలగొట్టాల్సి వచ్చింది.అయితే యంగ్ హీరోలు ఇలాంటి యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి డూప్ లను పెట్టుకుంటారు.

కానీ ఈ యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి అమితాబ్ ఎలాంటి డూప్ లేకుండా,తానే స్వయంగా స్టంట్స్ చేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు.ఈ విషయాన్ని స్వయంగా ఈ యాడ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనోహర్ వర్మ వెల్లడించారు.

Telugu Sequence, Bollywood, Jhund, Dope-Movie

ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే వయసుతో ముఖ్యం కాదని బిగ్ బీ మరోసారి నిరూపించుకున్నారు.వయసు కేవలం ఒక సంఖ్య అని అమితాబ్ తెలిపారు.అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని డైరెక్టర్ మనోహర్ వర్మ వెల్లడించారు.అమితాబ్ అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రన్‌వే 34 లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube