ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో శుక్రవారం రోజున విడుదలైంది.మే నెలలో విడుదల చేస్తే సినిమాకు కలెక్షన్స్ విషయంలో ప్లస్ అయ్యే అవకాశం ఉన్నా మేకర్స్ మాత్రం ఈ సినిమాను మార్చి నెలలోనే రిలీజ్ చేశారు.
భారీస్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందని మేకర్స్ భావించగా వాళ్ల అంచనాలు నిజమవుతున్నాయి.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్లను సాధించినా ఫస్ట్ వీకెండ్ తర్వాత భారీస్థాయిలో ఈ సినిమాలు కలెక్షన్లను సాధించలేదు.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ మండే టెస్ట్ ను పాసైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మండే బుకింగ్స్ బాగానే ఉన్నాయి.మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది.
ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమేనని అర్థమవుతోంది.తారక్, చరణ్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవాలని కన్న కలలు ఈ సినిమాతో నిజమయ్యాయి.
ఇప్పటివరకు ఈ స్టార్ హీరోల కెరీర్ లో ఒక్క సినిమా కూడా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదు.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం ఫుల్ రన్ లో ఈ సినిమా 2000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళిని దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది.రాజమౌళితో పని చేయడానికి ఇతర ఇండస్ట్రీల హీరోలు కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే రాజమౌళి మాత్రం తెలుగు హీరోలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు.