మొదలైన ఆపరేషన్ తెలంగాణ...అమిత్ షా భారీ స్కెచ్

తెలంగాణ రాజకీయం రోజురోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో బీజేపీ  రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

 Operation Telangana Started Amit Shah's Huge Sketch Kcr, Trs Party , Amit Shah,-TeluguStop.com

అయితే రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.అయితే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంతో ఆపరేషన్ తెలంగాణ అనే దానిని చాలా బలంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే రానున్న రోజుల్లో బీజేపీని బలమైన రాజకీయ పార్టీగా తెలంగాణలో ఎదిగేలా ఇప్పటికే 26 మంది ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.అంతేకాక ఈ ఎమ్మెల్యేల బృందం తెలంగాణలోని అన్ని  నియోజకవర్గాలు పర్యటించి అక్కడ భారతీయ జనతాపార్టీ బలం ఎంత ఉంది.

ఇంకా బలపడాలంటే  పార్టీ పరంగా ఎటువంటి  కార్యాచరణ చేపట్టాలనే దానిపై ఒక కీలక నివేదికను అమిత్ షా కు ఇవ్వనున్నారు.అంతేకాక క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ధర్నాలు, నిరసనలతో    హోరెత్తిస్తూ ప్రతి ఒక్క ధర్నా, నిరసన కూడా అమిత్ షా ఆదేశాలతోనే జరుగుతుందంటే ఇక తెలంగాణపై అమిత్ షా ఎంతగా ఫోకస్ చేసారనేది మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Amit Shah, Am

అయితే టీఆర్ఎస్ నుండి మాత్రం బీజేపీ రాజకీయ విధానంపై అంతగా స్పందించకున్నా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.అయితే అమిత్ షానే ఇక రంగంలోకి దిగడంతో బీజేపీ శ్రేణులు ఇక మరింతగా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంది.అయితే బీజేపీ మాత్రం ఎంతగా కెసీఆర్ కు వ్యతిరేకంగా వ్యవహరించినా ఇంకా ఇతర పార్టీలు కూడా కెసీఆర్ టార్గెట్ గానే వెళ్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube