సాధారణంగా కుక్కలు చాలా స్మార్ట్ అని చెప్పవచ్చు.అయితే ఒక్కోసారి ఇవి చేసే పనులను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు.
తాజాగా అలాంటి అబ్బురపరిచే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిని లాడ్ బైబిల్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.
ఇప్పుడు ఇది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చెక్క ఇంటికప్పు పైకి ఎక్కిన కుక్కని చూడొచ్చు.
అది హాయిగా ఆ హౌజ్ రూఫ్ పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.సాధారణంగా మెట్లు లేని ఇళ్లపైకి కుక్కలు ఎక్కడ అసాధ్యం.
కానీ ఇది ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.ఈ శునకం ఆ ఇంటిని ఒక నిచ్చెన సహాయంతో పైకి ఎక్కినట్లు చూడొచ్చు.
కుక్కలు నిచ్చెన ఎక్కడానికి చాలా భయపడుతుంటాయి.నిచ్చెన ఎక్కడం మాట అటుంచితే దిగడం కూడా కుక్కలకు చాలా కష్టం.
కానీ ఈ శునకం మాత్రం అవేమీ ఆలోచించకుండా తన యజమానిని ఫాలో అయిపోతూ ఇంటి పైకి ఎక్కి కూర్చుంది.తన తోటి కుక్క పైకి ఎక్కుతున్న దృశ్యాలు చూసి మరొక కుక్క ఆశ్చర్యపోయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు.ఇది చాలా స్మార్ట్ డాగ్ అని పొగుడుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షలకు పైచిలుకు లైక్స్ వచ్చాయి.అయితే ఈ కుక్కని దింపేందుకు రూఫ్ పై మరొక ఎక్సటెన్షన్ ఉన్నట్లు చెబుతున్నారు.ఆ ఎక్సటెన్షన్ ద్వారా కుక్కని కిందకు దించడం చాలా ఈజీ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా ప్రపంచంలో నిచ్చెన ఎక్కిన తొలి కుక్క ఇదే కావచ్చు ఏమో.ఈ వండర్ ఫుల్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.







