అన్నట్లుగానే సినిమా సక్సెస్‌ తో రాజమౌళి తో ఆ పని చేయించిన ఎన్టీఆర్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సినిమా కు సూపర్ హిట్ టాక్ దక్కడంతో వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్నాయి.

 Rajamouli Did Naatu Naatu Song Dance At Rrr Movie Success Celebrations Details,-TeluguStop.com

మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 500 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లుగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.సినిమా వెయ్యి కోట్లను వసూలు చేస్తుంది అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

దాంతో ఈ సినిమా సూపర్హిట్ అయినట్లే అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే రాజమౌళి తో ఎన్టీఆర్ నాటు నాటు డాన్స్‌ వేయించినట్లు గా తెలుస్తోంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని డ్యాన్స్ వేయాల్సిందిగా కోరగా ఆ సమయంలో ఆయన డ్యాన్స్ వేసేందుకు నిరాకరించారు.

అప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ ఇప్పుడు జక్కన్న డాన్స్ చేయకున్నా తాను సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ వేడుకలో కచ్చితంగా రాజమౌళి తో డాన్స్ వేయిస్తాను అంటూ అభిమానులకు మరియు ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు.

ఆ హామీ ప్రకారమే జక్కన్న రాజమౌళి తో నాటు నాటు డాన్స్ వేయించి ప్రతి ఒక్కరిని అలరించాడు.ప్రస్తుతం సోషల్ మీడియా లో వీడియో వైరల్ అవుతుంది.

నాటు నాటు స్టెప్పు లను ఇద్దరు హీరోలతో సమానంగా రాజమౌళి వేసి వావ్ అంటూ ప్రతి ఒక్కరూ అనేలా చేశాడు.రాజమౌళి బాగా డాన్స్ చేశాడు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనాలు.ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సన్నిహిత సంబంధాల తోనే రాజమౌళి తో ఎన్టీఆర్ ఈ స్టెప్ లు వేయించాడు.

రాజమౌళి కూడా చాలా ఆనందంగా సినిమాకు సంబంధించిన సక్సెస్ విషయం లో ఉన్నాడు.కనుక ఆ ఆనందంలో నాటు నాటు డాన్స్‌ వేసేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube