ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు యష్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన రికార్డు సృష్టించడంతో ఒక్కసారిగా సినీ ప్రపంచం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు చూసింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ క్రమంలోనే కేజిఎఫ్ 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇలా అభిమానుల ఎదురు చూపులకు తెర పడనుందని తెలుస్తోంది.ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరులో ట్రైలర్ లాంచ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హీరో యష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ… ఎనిమిదేళ్ల కష్టం ఈ సినిమా… ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేశారని, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు వారి చెమటను, రక్తాన్ని చిందించి ఈ సినిమా కోసం పని చేసి సినిమాని పూర్తి చేశారని, ఇలా ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ యష్ వెల్లడించారు.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాకు ఇస్తున్నారు.అయితే ఈ సినిమా క్రెడిట్ నాది కాదు…తెరవెనుక ఉండి ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కృషిచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కారణమని ఈ సినిమా కథ మొత్తం ఆయనకే చెందాలని యష్ వెల్లడించారు.







