నిత్యామీనన్ ను చచ్చినా పెళ్లి చేసుకోనన్న సంతోష్.. ఆమెకు హృదయం లేదంటూ?

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు.ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో నిత్యమీనన్ ఖాతాలో సక్సెస్ చేరింది.

 I Will Not Marry Actress Nitya Menon She Was Heartless A Letter Going Viral In-TeluguStop.com

ప్రస్తుతం నిత్యామీనన్ ఆహా ఓటీటీలో ఒక సింగింగ్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.తెలుగులో కథల ఎంపిక విషయంలో నిత్యామీనన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కెరీర్ పరంగా ప్రయోజనం చేకూరే పాత్రలకు మాత్రమే ఆమె ఓటేస్తున్నారు.

నిత్యామీనన్ వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సంతోష్ వర్కీ అనే వ్యక్తి నిత్యామీనన్ గురించి ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సినిమాలకు వెరైటీ రివ్యూలు ఇవ్వడం ద్వారా కేరళలో సంతోష్ పాపులారిటీని సంపాదించుకున్నారు.

సంతోష్ వర్కీ ఇచ్చే రివ్యూలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంటాయి.సంతోష్ గతంలో తనకు నిత్యామీనన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

నిత్యామీనన్ తో పెళ్లికి కూడా ప్లాన్ చేశానని సంతోష్ గతంలో అన్నారు .

అయితే ఇప్పుడు మాత్రం సంతోష్ నిత్యామీనన్ ను తాను చచ్చినా పెళ్లి చేసుకోనని చెబుతున్నారు.నిత్యామీనన్ కు హార్ట్ లేదంటూ సంతోష్ పోస్ట్ లో పేర్కొన్నారు.నిత్యామీనన్ మంచిది అయితే తనకు ఫోన్ నంబర్ అయినా ఇచ్చేదని సంతోష్ వర్కీ పేర్కొన్నారు.నిత్యామీనన్ తనను పెళ్లి చేసుకోమని అడిగితే తను రిజెక్ట్ చేసినట్టు సంతోష్ తన పోస్ట్ లో చెబుతుండటం గమనార్హం.

Telugu Nityamenon, Santosh-Movie

సంతోష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిత్యామీనన్ అభిమానులు అతనిని ట్రోల్ చేస్తున్నారు.వైరల్ కావడం కొరకు సంతోష్ చేస్తున్న ఇలాంటి కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిత్యామీనన్ అభిమానులు చెబుతున్నారు.పాపులారిటీ కోసం ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని నిత్యామీనన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube