తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు.అయితే కొద్ది మంది మాత్రమే సక్సెస్ లు దక్కించుకున్నారు.
ఆ కొద్ది మందిలో సూపర్ హిట్ లు దక్కించుకున్న వారు కూడా చాలా కొద్ది మంది అనడంలో సందేహం లేదు.ఆ కొద్ది మందిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉంటాడు.
తండ్రి మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే మగధీర వంటి సూపర్ డూపర్ హిట్ను సొంతం చేసుకోవడం ద్వారా తెలుగు లో టాప్ స్టార్ హీరో గా నిలిచాడు.ఆ సినిమా తర్వాత వరుసగా సక్సెస్లను దక్కించుకోలేక పోయినా కూడా తన స్టార్ డమ్ నిలబెట్టు కోవడం లో రామ్చరణ్ సక్సెస్ అయ్యాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
భారీ అంచనాల నడుమ తాజాగా విడుదలయిన ఆర్‌ఆర్ఆర్ సినిమా లో ఆయన నటన విశ్వరూపం ను తెలుగు ప్రేక్షకులకు చూపించాడు.తద్వారా ఆయనను సూపర్ స్టార్ గా మరింత చేరువ చేసింది అనడం లో సందేహం లేదు.
చిరంజీవి నట వారసుడి గా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవడంలో రామ్ చరణ్ చాలా స్పీడ్ గా వ్యవహరించాడు.

ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి.ఆ విజయాలు రామ్ చరణ్ ని స్టార్ హీరోగా నిలిపాయి అనడంలో సందేహం లేదు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదలైన రెండవ రోజే రామ్ చరణ్ పుట్టిన రోజు అవ్వడంతో ఆ సినిమా విజయోత్సవాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా జరుపుకుంటున్నాడు.
ఈ పుట్టిన రోజు రామ్ చరణ్ కి ఖచ్చితంగా చాలా స్పెషల్ గా రాజమౌళి చేశాడు.







