అద్భుతం.. ఉమ్మనీటి సంచితోనే పుట్టిన బిడ్డ.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..!

సాధారణంగా ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన్నప్పుడు శిశువు చుట్టూ ఉన్న ఉమ్మనీటి సంచి పగిలిపోతుంది.అయితే ఉమ్మనీటి సంచితో పిల్లలు పుట్టడం చాలా అరుదు.80,000 మందిలో ఒక శిశువు మాత్రమే ఇలా ఉమ్మనీరుతో జన్మిస్తారట.అయితే అలాంటి అరుదైన ఘటన తాజాగా వెలుగు చూసింది.

 A Baby Born With A Bag Of Water If You Watch The Video You Will Be Amazed, Kids-TeluguStop.com

సిజేరియన్ ద్వారా ఒక కవల ఆడ శిశువు ఉమ్మనీటి సంచితో జన్మించింది.ఈ బిడ్డకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.మార్చి 23న స్పెయిన్‌లోని వాలెన్సియా ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో ఒక బిడ్డ అరుదైన రీతిలో పుట్టింది.ఈ బిడ్డ అమ్నియోటిక్ శాక్ లేదా ఉమ్మనీటితో జన్మించింది.ఈ సంచి సన్నని, బలమైన జత పొరలు కలిగి ఉంటుంది.

అమ్నియోటిక్ శాక్ పగిలినప్పుడు “వాటర్ బ్రేకింగ్” అనే పదాన్ని ఉపయోగిస్తారు.ప్రతి బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ సంచిలోనే ఉంటుంది.

అయితే ఈ ప్రసవం చేసిన డాక్టర్లు అరుదైన జననం గురించి అందరికీ తెలియజేశారు.అలాగే ఫొటోలు, వీడియోలు ట్విట్టర్ లో షేర్ చేసి ఇది చాలా అరుదైన జననం అని పేర్కొన్నారు.

“ఇది ప్రతి 80,000 ప్రసవాలకు ఒకసారి జరుగుతుంది.తాజా ప్రసవంలో కవలలు పుట్టినప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు,” అని ఒక వైద్యురాలు చెప్పింది.

ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఒక వీడియో కి ఇప్పటికే 32000 పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.మీరు కూడా దీనిపై ఒక లుక్కేయండి.ga

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube