రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా కు సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కింది.మొదటి రోజే దాదాపుగా రూ.270 కోట్ల వసూళ్ల ను సాధించి ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యే వరకు రూ.500 కోట్లు ఈజీ గా పూర్తి చేసి సరి కొత్త రికార్డు లను నమోదు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఈ విషయం లో ఎలాంటి అనుమానం అక్కర లేదు అని సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేవలం సౌత్ ఇండియా లోనే కాకుండా నార్త్ ఇండియా లో కూడా ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలు వేసుకుంటున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
బాలీవుడ్ స్టార్ హీరో ల సినిమా లు.స్టార్ ఫిల్మ్ మేకర్ల సినిమాలు ఏ ఒక్కటి కూడా ఈ స్థాయిలో ఇప్పటి వరకు వసూలు దక్కించుకున్న దాఖలాలు లేవు అనడంలో సందేహం లేదు.
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి 2 సినిమాలు మరియు ఈ సినిమా మూడు సినిమా లు కూడా ఒక రేంజ్ లో వసూళ్ల ను స్వంతం చేసుకోవడం తో అరుదైన రికార్డు దక్కింది.కేవలం రాజమౌళి కి ఈ అరుదైన ఘనత దక్కింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
మూడవ సారి వరుసగా ఈ స్థాయి వసూళ్లను సొంతం చేసుకున్న రాజమౌళి గురించి బాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ మీడియా వారు మాట్లాడించే ప్రయత్నం చేశారు.అలాగే బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ గా చెప్పుకునే కొందరు స్టార్ దర్శకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు.

కాని వారు మొహం చాటేశారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.బాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకులు కొందరు ఇప్పటికే ఈ సినిమా ను చూసి వావ్ అంటూ తమ ఫీలింగ్ ప్రకటించారు, కానీ తమకు ఇంతటి సినిమా ఎందుకు పడడం లేదు అనే భావన.బాధ వారిలో ఉందట.మొత్తానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను సైతం అబ్బుర పరిచే సినిమాలు తీయడం కేవలం రాజమౌళి కే చెల్లింది.ఇలాంటి దర్శకుడు మన తెలుగు వాడు అవ్వడం మనకు కచ్చితంగా గర్వకారణం.







