సిక్కోలులో ఎడ‌మొఖం.. పెడ‌మొఖం...! టీడీపీకి పూర్వ వైభ‌వం వ‌చ్చేనా ?

టీడీపీ కంచుకోట ఉత్త‌రాంధ్ర‌లో 2019 ఎన్న‌క‌ల్లో మిన‌హా మిగ‌తా అన్ని ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటింది.ఇక జ‌గ‌న్ దూకుడుకు 10 అసెంబ్లీ సీట్ల‌కు రెండు సీట్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది.

 Tdp Group Politics Sikkolu Constituency Kala Venkat Rao Atchennaidu Details, Tdp-TeluguStop.com

ఇక‌పోతే మ‌రో రెండేండ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.కాగా మొత్తం 10 సీట్ల‌కు గాను 10 సీట్లు సాధిస్తామ‌నే ధీమాలో టీడీపీ ఉంది.

కానీ, కిందిస్థాయిలో టీడీపీ ప‌ర్ఫామెన్స్ ఏంట‌నేది సందిగ్ధంగా మారుతోంది.ఉత్త‌రాంధ్ర సిక్కోలులో టీడీపీ ముఖ్య‌నేత‌లు ఉన్నారు.

ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు ఒకే పార్టీలో ప్ర‌త్య‌ర్థులుగా ఉండ‌డం ఇందుకు అద్దంప‌డుతోంది.వారే ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కిమిడి క‌ళా వెంక‌ట‌రావు, ప్ర‌స్తుత టీడీపీ ప్రెసిడెంట్ కింజ‌రాపు అచ్చెన్నాయుడుగా చెప్పొచ్చు.

వీరిద్ద‌రు కూడా బీసీ నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే 1983 నుంచి ఉత్త‌రాంధ్ర సిక్కోలు జిల్లాలో క‌ళావెంక‌ట‌రావు పార్టీలో ఉన్నారు.

ఈన దివంగ‌త ఎర్ర‌న్నాయుడుకి స‌మ‌కాలీనుడు అనే టాక్ ఉంది.మ‌రోవైపు 1996 నుంచి అన్న‌చాటు తమ్ముడిగా అచ్చెన్నాయుడు రాజ‌కీయాల్లోక వ‌చ్చారు.

పార్టీలో నేడు అత‌ను శాసించే స్థాయిలో ఉన్నారు.ఎర్ర‌న్నాయుడు ఉన్న‌ప్ప‌టి నుంచే కింజ‌రాపు ఫ్యామిలితో విభేదాలు ఉన్నాయి.

వీరిద్ద‌రిని చంద్ర‌బాబు స‌మానంగా చూసుకున్నా ఆధిప‌త్య పోరు మాత్రం కొన‌సాగుతూనే వ‌స్తోంది.ప్ర‌స్తుతం పార్టీకి ముందు చూస్తే నుయ్యి.

వెనుక చూస్తే గోతి అన్న‌చందంగా ఉంది.దీంతో టీడీపీ అధినేత అప‌సోపాలు ప‌డుతున్నాడు.

సొంత జిల్లాలోనే నేత‌లు ఎడ‌ముఖం.పెడ‌ముఖంగా ఉండ‌డం త‌ల‌కుమించిన భారంగా మారుతోంది.

దీనికి తోడు గ్రూపు రాజ‌కాయాలు స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతోంది.

Telugu Ap, Atchennaidu, Chandrababu, Kala Venkat Rao, Kalamatavenkata, Tdp-Polit

అయితే క‌ళావ‌ర్గం మీద అచ్చెన్న‌ వ‌ర్గం టార్గెట్ చేయ‌డంతో సిక్కోలు జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లు డౌట్‌లో ప‌డ్డాయ‌ని టాక్‌.ఎచ్చ‌ర్ల‌లో క‌ళా వెంక‌ట‌రావు ఇన్‌చార్జి అయితే ఇక్క‌డ చౌద‌రి, బాబ్జీల్ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడును అచ్చెన్న‌వ‌ర్గం క‌ళాకు యాంటీగా వ్య‌వ‌హ‌రిస్తోందని స‌మాచారం.ఇక పాల‌కొండ‌లో క‌ళా మ‌నిషిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నిమ్మ‌ల జ‌య‌క్రిష్ణ‌కు యాంటీగా ప‌డాల భూదేవిని అచ్చెన‌న వ‌ర్గం తెర‌మీద‌ర‌కు తెస్తోంట‌.

Telugu Ap, Atchennaidu, Chandrababu, Kala Venkat Rao, Kalamatavenkata, Tdp-Polit

మ‌రోవైపు పాత‌ప‌ట్నంలో మాజీ ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ‌కు యాంటీగా మామిడి దోవిందాన్ని అచ్చెన్న ద‌గ్గ‌రుండి ప్రోత్స‌హిస్తున్నార‌ట‌.ఈ మూడు సీట్లు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నాయి.2024 ఎన్నిక‌ల్లో ఈ మూడు స్థానాలు గెలుచుకోవాలంటే ఐక్యంగా ప‌నిచేయాల్సి ఉంటుంది.పైకి న‌వ్వులు చిందిస్తూ వెన‌కాల గోతులు త‌వ్వే నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపులు మెయింటెన్స్ చేస్తే ఓట‌మి త‌థ్యమ‌ని టీడీపీ కేడ‌ర్ భావిస్తోంద‌ని తెల‌సింది.

మ‌రి సిక్కోలులో టీడీపీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డుతుందో ? వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube